తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedic Rules To Exercise: వ్యాయామం ఏ సమయంలో చేయాలి? ఎప్పుడు ఆపాలి? ఆయుర్వేదం చెబుతోంది ఇదే

Ayurvedic rules to exercise: వ్యాయామం ఏ సమయంలో చేయాలి? ఎప్పుడు ఆపాలి? ఆయుర్వేదం చెబుతోంది ఇదే

Parmita Uniyal HT Telugu

15 February 2023, 4:30 IST

    • Ayurvedic rules to exercise: ఆయుర్వేద నియమాలను అనుసరించి వ్యాయామం ఏ సమయంలో చేయాలి? ఎంత సేపు చేయాలి? ఎప్పుడు ఆపేయాలి వంటి విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
వ్యాయామానికి ఆయుర్వేద నియమాలు
వ్యాయామానికి ఆయుర్వేద నియమాలు (Pinterest)

వ్యాయామానికి ఆయుర్వేద నియమాలు

మీరు కఠినమైన వ్యాయామాలు చేసొచ్చాక బాగా అలసిపోతున్నారా? మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటున్నారా? లేక నిద్ర పట్టడం లేదా? మీ ఆరోగ్యం కోసం వర్కవుట్స్ చేయడం చాలా ముఖ్యమైన విషయమే. మీరు ఫిట్‌గా ఉండేందుకు, అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు వ్యాయామం అవసరం. అయితే అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా మీరు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కొన్ని రసాయనాలు వెలువడి మీ మెదడులో ప్లెజర్ సెంటర్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. ఈ కారణంగానే కొందరు వ్యాయామానికి బానిస అవుతారు. అయితే కఠినమైన వ్యాయామాలు కండరాల నొప్పులు, ఫ్రాక్చర్లు, గాయాలకు దారితీస్తాయి. ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు. కఠిమైన వ్యాయామాలు గుండె పోట్లకు దారితీశాయి. పలువురు ప్రముఖులు ఇలా గుండె పోటుకు గురై మరణించాలి. అందువల్ల వ్యాయామం నిదానంగా, స్థిరంగా సాగాలి.

రోజువారీ దినచర్యలో వ్యాయామం అవసరమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన మార్గంలో చేయాలని సూచిస్తోంది. వ్యాయామం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అనుసరించాల్సిన ఆయుర్వేద మార్గాలను ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ నీతికా కోహ్లీ ఇక్కడ సూచించారు.

ఏ సమయంలో వ్యాయామం చేయాలి?

‘ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. దీని వల్ల మీ ఆరోగ్యం పునరుజ్జీవనం పొందుతుంది. అన్ని రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. సాయంకాలం రిలాక్స్ అవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మంచి సమయం..’ అని డాక్టర్ కోహ్లీ చెప్పారు.

ఎంత సేపు చేయాలి? ఎంత కఠినమైన వ్యాయామాలు ఎంచుకోవాలి?

‘రోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మీ సామర్థ్యంలో 50 శాతం మేర వ్యాయామం చేస్తే సరిపోతుంది. మీరు ఫిట్‌గా ఉండడానికి వ్యాయామం చేయాలి. అంతేగానీ వారంలో రెండు రోజులు రెండు గంటలపాటు వ్యాయామం చేస్తే మీరు తీవ్రంగా అలసిపోతారు..’ అని డాక్టర్ కోహీ చెప్పారు.

‘ఆరోగ్యకరమైన వ్యాయాం అంటే మీ సామర్థ్యంలో సగమే చేయడం. ఆయుర్వేదం ఇదే చెబుతోంది..’ అని అన్నారు. ‘మీరు ముక్కు ద్వారా శ్వాస తీసుకోగలగాలి. మాట్లాడగలగాలి. కాస్తంత చెమట పట్టడం మంచిదే..’ అని వివరించారు.

వర్కవుట్ ఎప్పుడు ఆపేయాలి?

‘మీ శరీరం వెచ్చగా అనిపించాలి. కానీ అలసిపోకూడదు. కఠినమైన వ్యాయామం చేస్తున్నప్పుడు కావాలంటే మీరు మధ్యమధ్య విరామం తీసుకోవచ్చు. మీ స్టామినాను నెమ్మదిగా మెరుగుపరుచుకోండి..’ అని ఆయుర్వేద వైద్య నిపుణులు వివరించారు.

వ్యాయామానికి మూడు సూత్రాలు

వ్యాయామానికి మూడు సూత్రాలను ఆయుర్వేదం చెబుతోంది. బలం పెంపొందించుకోవడం. ఉదాహరణకు సూర్య నమస్కారం, బరువు ఎత్తడం. ఇక రెండోది ఫ్లెక్సిబిలిటీ. అంటే యోగా, స్ట్రెచింగ్. ఇక మూడోది ఓరిమి. జాగింగ్, సైక్లింగ్, స్విమింగ్, వేగంగా నడవడం వంటివి.

వ్యాయామాలలో ఈ ఉత్తమ మార్గాలతో మీరు మెరుగైన ఫలితాలను పొందడమే కాకుండా మీ ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం