Signs of heart disease in men: గుండె జబ్బు కావొచ్చు… పురుషులు ఈ సంకేతాలను విస్మరించవద్దు-consultant cardiac surgeon explains know the signs of heart disease in men ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Signs Of Heart Disease In Men: గుండె జబ్బు కావొచ్చు… పురుషులు ఈ సంకేతాలను విస్మరించవద్దు

Signs of heart disease in men: గుండె జబ్బు కావొచ్చు… పురుషులు ఈ సంకేతాలను విస్మరించవద్దు

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 03:53 PM IST

Signs of heart disease in men: హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ హార్ట్ డిసీజ్, ఆంజినా, అరిథ్మియా వంటి సాధారణ గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని సంకేతాలను పురుషులు విస్మరించకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ముఖ్యమైన సంకేతాలు, లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.

పురుషులు ఈ సంకేతాలను విస్మరించొద్దంటున్న వైద్య నిపుణులు (ప్రతీకాత్మక చిత్రం)
పురుషులు ఈ సంకేతాలను విస్మరించొద్దంటున్న వైద్య నిపుణులు (ప్రతీకాత్మక చిత్రం) (Photo by Ben Hershey on Unsplash)

గుండె జబ్బులు వృద్ధులు, వయోజనుల్లో సర్వసాధారణమైపోయింది. పురుషులైనా, మహిళలైనా కదలిక లేని జీవన శైలిని గడపడం గుండె పోటు రిస్క్‌ను పెంచుతోంది. ముఖ్యంగా హైబ్లడ్ ప్రెజర్, అధిక కొలెస్ట్రాల్ స్థాయి, రక్తంలో అధిక చక్కెర స్థాయి, పొగ తాగే వారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వారిలో గుండె జబ్బుల వస్తుంటాయి. ఇవి మాత్రమే కాకుండా గుండె జబ్బులతో కూడిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కుటుంబ సభ్యులకు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలను అస్సలు విస్మరించవద్దు.

ఇండియాలో చావులకు గుండె జబ్బు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తోంది. హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ హార్ట్ డిసీజ్, యాంజీనా వంటి సమస్యలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి.

ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిపీన్ చంద్ర భామ్రే హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుండె సంబంధిత సమస్యలపై విడమరిచి చెప్పారు. ముఖ్యంగా హార్ట్ డిసీజ్ విషయంలో మగవాళ్లు విస్మరించలేని సంకేతాలు, లక్షణాల గురించి వివరించారు. సరైన సమయంలో గుర్తించి తక్షణం వైద్య చికిత్స పొందాలని సూచించారు. ఆయన సూచించిన గుండె జబ్బుల సంకేతాలు, లక్షణాలు ఇక్కడ చదవండి.

మగవారిలో గుండె సంబంధిత సమస్యల సంకేతాలు, లక్షణాలు

  1. ఛాతీలో అసౌకర్యం: ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్టయితే మీ గుండె పనితీరులో ఏదో లోపం ఉన్నట్టు గుర్తించాలి. చాతీలో నెడుతున్నట్టు, మండుతున్నట్టు కొందరు గమనిస్తారు. ముఖ్యంగా నడక లేదా ఏదైనా పని తరువాత ఇలాంటి సంకేతాలు గమనిస్తారు. ఛాతీలో అసౌకర్యం పురుషుల్లో కరోనరీ ఆర్టరీ వ్యాధికి సంకేతం. ఇది గమనించినప్పుడు ముందుగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి.
  2. వికారం, అజీర్ణం, కడుపు నొప్పి: కొందరు పేషెంట్లలో వికారం, కడపు నొప్పి, అజీర్ణం గుండె జబ్బుకు సంకేతం.
  3. చేయి నొప్పి: నొప్పి ఛాతీ నుండి ఎడమ చేయి వైపుకు వ్యాపిస్తే, దానిని గుండెపోటు అంటారు. ఎడమ భుజం, చేయిలో తిమ్మిరి, బలహీనంగా ఉండడం వంటి సంకేతాలు కూడా గుండె పోటును సూచిస్తాయి.
  4. తలతిరగడం: గుండె మెదడుకు, ఇతర భాగాలకు రక్తాన్ని పంపిణీ చేయలేకపోతే తల తిరగడం సంభవించవచ్చు. శరీరంలో అవసరమైన రక్త ప్రసరణ లేనప్పుడు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. తేలికపాటి తలనొప్పి, మైకము గుండె అరిథ్మియా, కార్డియోమయోపతితో కూడా సంబంధం కలిగి ఉంటాయి.
  5. గుండె నొప్పి లేదా ఆంజినా: నొప్పి ఛాతీ మధ్య భాగం నుంచి ఎడమ భుజానికి లేదా గొంతుకు పాకుతుంది. నడక లేదా ఇతర పనులు చేసిన తర్వాత ఇలా జరుగుతుంది.

నడక తర్వాత మీకు అసౌకర్యం లేదా నొప్పి ఉందని మీ వైద్యుడికి చెప్పడానికి సంకోచించకండి. వైద్య పరీక్షల వల్ల సరైన చికిత్స పొందవచ్చు. ఈ విషయంలో డాక్టర్ బిపీన్‌చంద్ర భామ్రే మాట్లాడుతూ ‘గుండె జబ్బులను అరికట్టడానికి, మీరు రోజూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండడం, బరువు అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. మీ గుండెను అత్యంత జాగ్రత్తగా చూసుకోవడానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ప్రతి 6 నెలలకోసారి డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్ హార్ట్ హెల్త్ స్క్రీనింగ్‌కు వెళ్లండి. అలాగే గుండె దృఢంగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండండి..’ అని సూచించారు.

WhatsApp channel

సంబంధిత కథనం