Navdhari Bhindi: తొమ్మిది చారలుండే శ్రావణ బెండకాయలివి, కనిపిస్తే వదలొద్దు.. వీటితో లాభాలెన్నో
09 September 2024, 12:30 IST
- Navdhari Bhindi: వినాయక చవితి సమయంలో నవధారి భిండి కూరను కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా తయారు చేస్తారు. ఈ నవధారి బెండకాయకు ఆ పేరెందుకుందో, మామూలు బెండితో పోలిస్తే దీని లాభాలేంటో చూడండి.
నవధారీ బెండకాయలు
గణేశ్ చతుర్థి రోజు నైవేద్యంగా మోదుకలు, లడ్డూలు, ఉండ్రాళ్లు.. అనేక రకాల పిండి పదార్థాలు నివేదిస్తారు. మహారాష్ట్ర, చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం నవధారీ బెండకాయతో చేసిన కూరను తప్పకుండా నివేదిస్తారు. ఈ పండగ సమయంలో నవధారీ బెండకాయల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. మామూలు బెండకాయలకీ వీటికి మధ్య ఉండే తేడాలు, వీటి లాభాలు చూసేయండి.
నవధారీ బెండకాయలు:
మామూలు బెండకాయల మీద నిలువుగా నాలుగైదు చారలు ఉంటాయి. కానీ ఈ నవధారీ బెండకాయల మీద నిలువుగా 9 చారలుంటాయి. అందుకే వాటికాపేరు. ఇవి శ్రావణ మాసంలో ఎక్కువగా దొరుకుతాయి. ఆగష్టు చివరి నుంచి అక్టోబర్ దాకా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీటిని శ్రావణి బేండీ అని కూడా అంటారు.
అలాగే మామూలు బెండ కాయలతో పోలిస్తే వీటికి జిగురు చాలా తక్కువగా ఉంటాయి. కట్ చేసినప్పుడు జిగట తక్కువగా అనిపిస్తుంది. సైజులో కూడా మామూలు బెండకాయల కన్నా కాస్త పొడవుగా ఉంటాయి. వీటి రంగు కూడా మామూలు బెండకాయల కన్నా కాస్త తక్కువ పచ్చదనంతో ఉంటుంది. ఇవి ఎక్కువగా ఉత్తర భారత దేశ ప్రాంతాల్లో దొరుకుతాయి. కానీ సూపర్ మార్కెట్ల వల్ల మన దగ్గరా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. అసలు వీటిని ఎందుకు తినాలో తెల్సుకోండి.
బెండకాయలు కొనేటప్పుడు మృదువైన బెండకాయను కొనడానికి ఇష్టపడతారు. ఇది కట్ చేయడం సులభం, రుచిలో కూడా బాగుంటుంది. కానీ నవధారి భిండి మిగతా లేడీ ఫింగర్స్ కంటే పొడవుగా, మందంగా, కొంచెం గట్టిగా ఉంటుంది. సులభంగా విరిగిపోతుంది. కట్ చేయడం చాలా సులువు. రుచి కూడా కాస్త తియ్యదనంతో, క్రిస్పీగా బాగుంటుంది.
నవధారీ బెండకాయలతో లాభాలు:
- నవధారి బెండకాయలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెండకాయలో ఉండే విటమిన్లు శ్లేష్మ పొరలు ఏర్పడటానికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- నవధారి బెండకాయ చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నవధారి బెండకాయ తీసుకోవడం అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- నవధారి బెండకాయ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా నవధారి బెండకాయలో ఎక్కువుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా కంటి, జుట్టు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.