మధుమేహనికి చెక్ పెట్టేయండి..! బెండకాయ తింటే బోలెడు లాభాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 11, 2024

Hindustan Times
Telugu

బెండకాయలో అధిక పీచు ఉంటుంది.  దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. మధుమేహం స్థాయులు తగ్గుతాయి.

image credit to unsplash

బెండకాయలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వయసుతో వచ్చే కళ్ల జబ్బులు రాకుండా చూస్తుంది. క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

image credit to unsplash

బెండకాయలో ఉండే పెక్టిన్ అనే కరిగే పీచు వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణ తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

image credit to unsplash

బెండకాయ జీర్ణవ్యవస్థకు  చాలా మేలు చేస్తుంది. మలబద్దకం నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

image credit to unsplash

బెండాకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తరచూ ఏదైనా తినాలనే కోరిక ఉండదు. 

image credit to unsplash

బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన అంశం, 

image credit to unsplash

బెండకాయను నూనెలో డీప్ ఫ్రై చేసి తినటం కంటే ఆవిరి మీద ఉడికించి తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels