National Mango day: జాతీయ మామిడి పండ్ల దినోత్సవం, టేస్టీ ఆమ్రఖండ్‌తో రోజు మొదలుపెట్టండి
22 July 2024, 6:00 IST
National Mango day: మామిడి పళ్ల చరిత్ర నుండి ప్రాముఖ్యత వరకు, ఈ ప్రత్యేక రోజు గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవే.
ఆమ్రఖండ్
మామిడి పండ్లు లేని వేసవి కాలం గురించి ఆలోచించగలమా? ఎండాకాలంలో మండే ఎండలుంటాయని తెల్సినా కూడా వేసకి కోసం ఎదురు చూస్తున్నామంటే దానికి కారణం మామిడి పండే. మామిడిపండ్లు భారతీయ సంస్కృతి, భారతీయ వంటకాల్లో పెద్ద భాగం. మామిడి లస్సీ నుంచి పచ్చిమామిడి చేపల కూర, మామిడి స్మూతీల వరకు మామిడి పండ్లను పళ్లెంలో ప్రత్యేక వంటకాల్లో చేర్చేస్తాం. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మామిడి పండ్లను తినడం మనకు ఇష్టమైన వేసవి జ్ఞాపకాలు.
జాతీయ మామిడి దినోత్సవం:
రుచి, దాని బహుళ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఈ పండును గుర్తు చేసుకోడానికి ప్రతి సంవత్సరం, జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం, జూలై 22 న జాతీయ మామిడి దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది జాతీయ మామిడి దినోత్సవం సోమవారం వస్తోంది. ఈ ప్రత్యేక రోజును సెలెబ్రేట్ చేసుకోడానికి ప్రత్యేక ఆమ్రఖండ్ రెసిపీ ప్రయత్నించండి.
ఆమ్రఖండ్ రెసిపీ కోసం కాావాల్సిన పదార్థాలు:
750 గ్రా పెరుగు
150 గ్రా తాజా మామిడి పండ్ల నుండి తీసిన మామిడి గుజ్జు
150 గ్రా పౌడర్ షుగర్
2 గ్రా యాలకులు
20 మి.లీ పాలు
2 గ్రా కుంకుమపువ్వు
20 గ్రాముల తరిగిన పిస్తా
20 గ్రాముల తరిగిన బాదం
ఆమ్రఖండ్ రెసిపీ తయారీ విధానం:
1. ముందుగా గడ్డ పెరుగును ఒక కాటన్ వస్త్రంలో వేసుకోవాలి. దాంట్లో నీళ్లన్నీ పోయేలా వేళాడదీయాలి. లేదంటే మార్కోట్లో దొరికే నీరులేని గడ్డ పెరుగును నేరుగా దీని కోసం వాడవచ్చు.
2. ఇప్పుడు పెరుగును గిన్నెలో వేసుకుని మెత్తగా అయ్యేవరకు బాగా విస్క్ చేసుకోవాలి. అందులో పంచదార, యాలకుల పొడి వేసుకోవాలి.
3. కుంకుమ పువ్వును గోరువెచ్చని నీళ్లలో నానబట్టి ఉంచుకోవాలి. దానివల్ల మంచి రంగు వస్తుంది.
4. పాలలో పంచదాన ఎక్కువైనా, లేదంటే పెరుగు గట్టిగా అనిపించినా కొద్దిగా పాలు పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి.
5. అన్నీ బాగా కలుపుతూ ఉండాలి. కాసేపటికి పెరుగు బాగా తేలికగా నురుగు లాగా అయినట్లు అనిపిస్తుంది.
6. అందులో మామిడిపండు గుజ్జు కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. మీద కుంకుమపువ్లు కలిపిన పాలు, తరిగిన డ్రై ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చాలు. ఆమ్రఖండ్ రెడీ.
మామిడి ఆరోగ్య ప్రయోజనాలు:
జ్యూసీగా, రుచికరంగా ఉండే పండుని దాని రుచి కోసమే ఇష్టపడక్కర్లేదు. దాని పోషక విలువ తెలిస్తే మరింత ఇష్టపడతారు. మామిడి పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్నందు వల్ల ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.