Visas for Maldives Tour । మాల్దీవులకు టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవిగో వీసా రకాలు!
16 January 2023, 15:40 IST
- Types of Visas for Maldives Tour: మాల్దీవులు సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీ అవసరాన్ని బట్టి ఎన్ని రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Types of Visas for Maldives Tour
మాల్దీవులు పర్యాటకులకు స్వర్గధామం, భారతీయులు ఎక్కువగా కోరుకునే ప్రదేశాలలో ఒకటి. మంత్రముగ్దులను చేసే క్రిస్టల్ క్లియర్ బీచ్‌లు, సాహసోపేతమైన కార్యకలాపాలను ప్రయత్నించే వారికి ఇది గొప్ప గమ్యస్థానం. భారతదేశానికి సమీపంలో ఉండటంతో, చాలా మంది కొంత జంటలు ఈ అందమైన ద్వీప దేశానికి తమ హనీమూన్ ప్లాన్ చేయడంలో ఆశ్చర్యం లేదు. అయితే మాల్దీవులను సందర్శించాలంటే తప్పనిసరిగా అవసరమైన వీసాను పొందాలి.
దాదాపు అన్ని దేశాల పౌరులకు మాల్దీవుల ప్రభుత్వం 'వీసా ఆన్ అరైవల్' సౌలభ్యం కల్పిస్తోంది. అంటే పర్యాటకంగా మాల్దీవులకు వెళ్లే విదేశీయుడికి ముందస్తు వీసా పొందడం అవసరం లేదు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా వీసా పొందవచ్చు. అయితే, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందడానికి ప్రాథమిక ప్రవేశ అవసరాలను తప్పనిసరిగా తీర్చాలి. ఈ నేపథ్యంలో వీసా ముందుగా తీసుకోవడం వలన వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రావు.
Types of Visas for Maldives Tour -మాల్దీవులు సందర్శనకు వీసా రకాలు
భారతదేశం నుండి మాల్దీవులు సందర్శించాలనుకునే పర్యాటకులు మాల్దీవులు అందించే వివిధ రకాల వీసాల గురించి అవగాహన కలిగి ఉండటం మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని రకాల వీసాలను మీకు తెలియజేస్తున్నాం, చూడండి.
1. పర్యాటక వీసా:
భారతదేశం నుండి మాల్దీవులకు ప్రయాణించడానికి అత్యంత సాధారణ రకమైనది టూరిస్ట్ వీసా. ఈ వీసా 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది, మీ పర్యటనను బట్టి 90 రోజుల వరకు పొడిగించుకోవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో లేదా భారతదేశంలోని మాల్దీవుల రాయబార కార్యాలయం నుండి పొందవచ్చు. ఈ వీసా పొందాలంటే మీ వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్, తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
2. వ్యాపార వీసా:
వ్యాపార ప్రయోజనాల కోసం మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల కోసం బిజినెస్ వీసా ఉంది. ఈ వీసా 90 రోజుల కాలానికి చెల్లుబాటు అవుతుంది, అదనంగా మరో 90 రోజుల పాటు పొడిగించుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేయడానికి ఒక చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టిక్కెట్, అలాగే సందర్శన ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ వారి కంపెనీ నుండి ఒక లేఖ అవసరం.
3. వర్క్ వీసా:
ఉద్యోగ ప్రయోజనాల కోసం మాల్దీవులకు వెళ్లే వ్యక్తుల కోసం వర్క్ వీసా అందుబాటులో ఉంది. ఈ వీసా 90 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అదనంగా మరో 90 రోజుల పాటు పొడిగించుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టిక్కెట్, సందర్శన ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ కంపెనీ నుండి ఒక లేఖ అవసరం.
4. విద్యార్థి వీసా:
విద్యా ప్రయోజనాల కోసం మాల్దీవులకు వెళ్లే విద్యార్థుల కోసం విద్యార్థి వీసా అందుబాటులో ఉంది. ఈ వీసా 90 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అదనంగా మరో 90 రోజుల పాటు పొడిగించుకోవచ్చు. ఇందుకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టిక్కెట్ అలాగే సందర్శన ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ విద్యా సంస్థ నుండి ఒక లేఖ అవసరం.
5. ట్రాన్సిట్ వీసా:
ట్రాన్సిట్ వీసా అనేది మాల్దీవులకు ప్రయాణించే పర్యాటకుల కోసం వారి విమాన సమయంలో కొద్దిసేపు లేదా లేఓవర్ కోసం అందించే వీసా, అంటే మీరు వేరే ఇతర దేశానికి వయా మాల్దీవులు వెళ్తుంటే మాల్దీవుల వద్ద విమానం ఆగినంత సేపు బయట తిరగటానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది, దీనిని పొడగించుకోలేరు. ఈ వీసా పొందటం కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్, బ్యాంకు ఖాతాలో తగినంత నిధుల రుజువును కలిగి ఉండాలి.
6. మెడికల్ వీసా:
వైద్య చికిత్స కోసం మాల్దీవులకు వెళ్లే సందర్శకులు మెడికల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా 90 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది, అదనంగా మరో 90 రోజుల పాటు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టిక్కెట్, సందర్శన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ భారతదేశంలోని ఆసుపత్రి నుండి ఒక లేఖ అవసరం.
ఇవి భారతదేశం నుండి మాల్దీవులకు ప్రయాణించడానికి భారతీయులకు అందుబాటులో ఉన్న వీసాల రకాలు. సందర్శన ఉద్దేశ్యాన్ని బట్టి ప్రతి వీసా దరఖాస్తు కోసం అవసరమయ్యే పత్రాలు మారవచ్చని గమనించడం ముఖ్యం. అదనంగా, వీసా రకాన్ని బట్టి వీసా రుసుములు , ప్రాసెసింగ్ సమయాలు మారవచ్చు. మరింత సమాచారం కోసం భారతదేశంలోని మాల్దీవుల ఎంబసీని కూడా సంప్రదించవచ్చు.