తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Walk । ప్రతిరోజూ మీ దినచర్య ప్రారంభించే ముందు, అరగంట మార్నింగ్ వాక్ చేయండి!

Morning Walk । ప్రతిరోజూ మీ దినచర్య ప్రారంభించే ముందు, అరగంట మార్నింగ్ వాక్ చేయండి!

HT Telugu Desk HT Telugu

03 August 2024, 22:48 IST

google News
    • morning walk: ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడకకు కేటాయించాలి. మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Morning Walk Benefits:
Morning Walk Benefits: (istock)

Morning Walk Benefits:

Morning Walk Benefits: మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నడక ఒక గొప్ప మార్గం. మార్నింగ్ వాక్ చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే అది మీ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది, అదనపు శరీర కొవ్వును తగ్గిస్తుంది, కండరాలకు బలాన్ని, సరైన ఆకృతిని అందిస్తుంది.

అంతేకాదు, అనేక తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు నడక చాలా ప్రభావవంతమైన చికిత్స. ఇది గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, బోలు ఎముకల వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అయితే ఒకరోజు మార్నింగ్ వాక్ చేసి మూడు రోజులు విరామం తీసుకోవడం వల్ల మేలు జరగదని గుర్తుంచుకోవాలి. రోజూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ఎంత అవసరమో, శరీర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. అందులోనూ నడక అనేది ఏ వయసు వారికైనా అనుకూలమైన, సౌకర్యవంతమైన, ఖర్చు లేని వ్యాయామం. ఇందుకోసం మీరు రోజూ ఉదయం 30 నిమిషాలు నడకకు కేటాయిస్తే చాలు. ప్రతిరోజూ 30 నిమిషాల మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

మీరు ఉదయాన్నే నడిస్తే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తపోటు నియంత్రణ

30 నిమిషాల నడకతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు రోగులు ప్రతిరోజూ నడవాలి.

బరువు తగ్గుతుంది

రోజూ 30 నిమిషాల పాటు నడవడం ద్వారా కూడా మీ పెరుగుతున్న బరువును నియంత్రించుకోవచ్చు. నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి.

డయాబెటిస్‌ నియంత్రణ

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. దీనితో పాటు సరైన డైట్ పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

సామర్థ్యం పెరుగుతుంది

నడక వలన మీలో సామర్థ్యం పెరుగుతుంది. మీరు మునుపటికంటే మరింత శక్తివంతంగా, చురుకుగా అనుభూతి చెందుతారు. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. కండరాల నొప్పులు నశిస్తాయి, శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.

మీకు ఒకేసారి 30 నిమిషాలు నడవడం చాలా కష్టంగా ఉంటే, రోజుకు 2 సార్లు నడవండి. ఉదయం 15 నిమిషాలు అలాగే సాయంత్రం 15 నిమిషాలు నడవండి. మీ సామర్థ్యం పెరిగేకొద్దీ క్రమంగా ఎక్కువ సెషన్‌లను పెంచుకోండి. ఎప్పుడైనా మీరు ఇంత సమయం కేటాయించలేనపుడు రోజులో ఇతర పనులకు నడక మార్గాన్ని ఎంచుకోండి.

పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, వారంలో కనీసం కనీసం ఐదు రోజులైనా 30 నిమిషాల పాటు మీరు వీలైనంత వేగంగా నడవడానికి ప్రయత్నించండి. చురుకైన నడకను కలిగి ఉండండి. చురుకైన నడక (brisk walking) అంటే మీరు ఇలా నడిచేటపుడు మాట్లాడగలరు కానీ పాడలేరు. ఒకవేళ మీకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు ఉంటే, శారీరక శ్రమ చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

టాపిక్

తదుపరి వ్యాసం