రోజు 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రెగ్యులర్‌గా సైక్లింగ్ (Cycling) చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతి 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే శారీరక దృఢత్వం పెరుగుతుంది
ప్రతిరోజూ సైక్లింగ్ (Cycling) చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. సైక్లింగ్ గుండె పోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులను నిరోధించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజు వారి దినచర్యలో సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్‌గా ఉండవచ్చు. శారీరక దృఢత్వానికి మానసిక శ్రేయస్సుకు సైక్లింగ్ మంచి వ్యాయామం.
సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కాలుష్యం విపరితంగా పెరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో, సైకిల్‌ను ఉపయోగించడం వల్ల ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు.
సైకిల్ తొక్కడం ద్వారా శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.
సైకిల్ తొక్కే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.
రోజూ సైకిల్ తొక్కే వారు ఇతరుల కంటే 15-20 శాతం ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు.
ఇది అనేక ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షిస్తుంది.
సైక్లింగ్ అనేది చౌకైన రవాణా మార్గం.
సైక్లింగ్ వల్ల గుండె. ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. అనేక ప్రాణాంతక వ్యాధులు దూరంగా ఉండవచ్చు.
చిన్న చిన్న పనుల కోసం బయటికి వెళ్ళినప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల చాలా చురుగ్గా ఉండడమే కాకుండా కేలరీలు కూడా ఖర్చవుతాయి. కార్డియో వ్యాయమాలలో సైక్లింగ్ కీలకమైనది. రోజు 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల కొవ్వు కరుగుతుంది. కేలరీలను కరిగించాలనుకుంటే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తోంది దీని వల్ల ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.
సంబంధిత కథనం