తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీదా? టీ పొడి స్వచ్ఛతను ఇలా తెలుసుకోండి

Tea Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీదా? టీ పొడి స్వచ్ఛతను ఇలా తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

19 August 2024, 16:30 IST

google News
    • Tea Adulteration: మీ ఇంట్లో ఉన్న టీ పొడి స్వచ్ఛమైనదో లేక కల్తీదో తెలుసుకోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. టీ పొడి పరీక్ష ఎలా చేయాలో తెలుసుకోండి.
కల్తీ టీ పొడిని కనిపెట్టడం ఎలా?
కల్తీ టీ పొడిని కనిపెట్టడం ఎలా? (Pixabay)

కల్తీ టీ పొడిని కనిపెట్టడం ఎలా?

Tea Adulteration: టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది కొంతమందికి ఎమోషన్‌గా మారిపోయింది. ఉదయం టీ తాగాకే పని మొదలుపెట్టే వారి సంఖ్య చాలా ఎక్కువ. రోజులో రెండు నుంచి మూడుసార్లు టీ తాగకపోతే ఏ పనీ చేయలేని వారి సంఖ్య ఎంతో ఎక్కువ. ఉదయం టీతోనే పనిని ప్రారంభిస్తారు. సాయంత్రం అయితే మళ్లీ సమయానికి టీ తాగాల్సిందే. లేకపోతే తలనొప్పి అంటూ కూర్చుండిపోతారు. ఇంతగా టీ అనేది జీవితాల్లో భాగమైపోయింది. అందుకే టీ పొడి కల్తీ కూడా పెరిగిపోయింది.

కల్తీ టీ పొడి

మీరు ఇంట్లో వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదో లేక కల్తీదో అని ఎప్పుడైనా ఆలోచించారా? టీ కోసం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్. దాన్ని కల్తీ చేసే వారి సంఖ్యను కూడా పెంచుతోంది. తాజాగా ఒడిశాలోని కటక్‌లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న కంపెనీలను ప్రభుత్వ అధికారులు గుర్తించారు. కాబట్టి మీరు ఇంట్లో వాడుతున్న టీ కూడా స్వచ్ఛమైనదో లేదా కల్తీదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ టీ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఈ ఆకులు లేదా టీ పొడిని చేతుల్లో వేసుకొని తీక్షణంగా చూడండి. అన్ని ఒకేలాగా ఆకారం, రంగు ఉండాలి. కొంతమంది టీ పొడి కాకుండా... టీ ఆకులు కొనుక్కుంటారు. ఆ టీ ఆకుల్లో కొన్ని ఆకులు వేరే రంగుని లేదా పెద్దపెద్ద ముక్కలుగా ఉంటూ ఉంటాయి. అలా ఉంటే అవి తక్కువ నాణ్యత గల టీ ఆకులు అని అర్థం. ఇతర చెట్ల ఆకులను అందులో కలిపారని అర్థం చేసుకోవాలి.

మంచి సుగంధం

స్వచ్ఛమైన టీ ఆకులు లేదా టీ పొడి ఒక ప్రత్యేకమైన సహజమైన సుగంధ పరిమళాన్ని వెదజల్లుతాయి. పాత వస్తువుల వాసన, మురికి వాసన వంటివి... టీ పొడి నుంచి వస్తే అవి మంచి టీ పొడి మంచిది కాదని అర్థం. కొన్ని రకాల రసాయనాలు కలపడం వల్ల కూడా టీ పొడి వాసన తగ్గిపోతుంది. కాబట్టి టీ పొడి ఘమఘుమలాడకుండా సాధారణంగా అనిపిస్తే అది స్వచ్ఛమైనది కాదని అనుమానించాలి.

స్వచ్ఛమైన, శుభ్రమైన టీ పొడి లేదా టీ ఆకులతో చేసిన తేనీరు తాగడం వల్ల రుచి అద్భుతంగా తెలుస్తుంది. టీ తాగిన తర్వాత మీకు ఎలాంటి ఆహ్లాదకరమైన రుచి తగలకపోతే ఆ టీ పొడి స్వచ్ఛమైనది కాదని భావించాలి. అలాగే తక్కువ నాణ్యత గల టీ తాగిన వెంటనే ఘాటైన చేదు లేదా ఒక అసహ్యమైన రుచిని కలిగి ఉంటాయి. అలాంటి రుచి మీకు తగిలితే ఆ టీ పొడిని పడేయడమే మంచిది.

నీటితో చెక్ చేయండి

టీ పొడిని కొద్దిగా తీసుకొని నీటిలో కలపాలి. అది స్వచ్ఛమైనది అయితే నీళ్లలో దాదాపు కలిసిపోయి చివరన సాధారణ టీ కణాలు మాత్రం మిగులుతాయి. అలా కాకుండా ముద్దముద్దగా అవక్షేపాలు మిగిలితే మాత్రం ఆ టీ పొడి మంచిది కాదని అర్థం చేసుకోవాలి.

బయట దొరికే టీ పొడిని కొనే బదులు మార్కెట్లలో సీల్ చేసి అమ్మే బ్రాండెడ్ టీ పొడులను కొనుక్కోవడం మంచిది. బయట లూజుగా దొరికే టీ పొడిలే అధికంగా కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు టీ పొడి ఖర్చు ఎక్కువైనా కూడా బ్రాండెడ్ సంస్థలకు చెందిన వాటిని కొనడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం