తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Milk Side Effects: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? వీటిని తాగి మరణించిన వారు కూడా ఉన్నారా?

Raw milk Side effects: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? వీటిని తాగి మరణించిన వారు కూడా ఉన్నారా?

Haritha Chappa HT Telugu

24 May 2024, 13:30 IST

google News
    • Raw milk Side effects: కొంతమంది పచ్చిపాలు తాగడం మంచిదని చెబితే, మరి కొందరు మరిగించిన పాలను మాత్రమే తాగడం మంచిది అని చెబుతారు. పచ్చిపాల గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పచ్చి పాలు తాగడం మంచిదేనా?
పచ్చి పాలు తాగడం మంచిదేనా? (Pixabay)

పచ్చి పాలు తాగడం మంచిదేనా?

Raw milk Side effects: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు పాలను తాగాలి. అయితే పచ్చిపాలను తాగడం మాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. పచ్చిపాల వల్ల మనకు తెలియకుండానే కొన్ని రకాల బ్యాక్టీరియాలు శరీరంలో చేరి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి అని వివరిస్తున్నారు.

పచ్చిపాలు అంటే నేరుగా ఆవుల నుంచి తీసిన పాలు. వీటిని అమ్మడానికి ముందు పాశ్చరైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అంటే పాలల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గిస్తారు. మానవ వినియోగానికి సురక్షితంగా మారుస్తారు. పాలను చెడగొట్టే బ్యాక్టీరియాను కూడా తగ్గించి... అది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా చేస్తారు. ఇలా పాశ్చరైజేషన్ ప్రక్రియ జరిగితేనే పాలు సురక్షితంగా మారుతాయి. అయితే ఎంతో మంది ఇలా పాశ్చరైజేషన్ చేయని పాలను అంటే ఆవుల నుంచి నేరుగా తీసుకున్న పాలను తాగేవారూ ఉన్నారు. అలాంటి పాలను తాగాల్సి వస్తే బాగా మరిగించాకే తాగాలి తప్ప, పచ్చివి పాలను తాగకూడదు. దీనివల్ల ఎన్నో బ్యాక్టీరియాలు శరీరంలో చేరుతాయి.

నిజానికి పచ్చిపాలు సహజమైనవి. యాంటీ మైక్రోబయోల్స్ అధికంగా కలిగి ఉంటాయి. అలాగే హానికరమైన బ్యాక్టీరియాను కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

పచ్చిపాలుతో ప్రమాదమా?

పచ్చిపాలు తాగడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి మరణం సంభవించే అవకాశం ఎక్కువ. అమెరికాలో 1900 కాలంలో కలుషితమైన పాలను తాగడం వల్ల పాతికేళ్లలోనే 65 వేల మంది మరణించినట్టు అంచనా వేస్తున్నారు. వీరంతా కూడా పచ్చిపాలను తాగి బోవిన్ క్షయ వ్యాధి బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మనుషులకు సులభంగా సోకుతుంది. ఇప్పటికీ పచ్చిపాలను తాగే అలవాటు ఉన్నవారి ప్రాంతాల్లో ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది.

పాశ్చరైజేషన్ ప్రక్రియ పూర్తయిన పాలలో, పచ్చిపాలతో పోలిస్తే పోషకాలు తక్కువగా ఉండొచ్చు. కానీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇలాంటి బ్యాక్టీరియాలు, విష పదార్థాలు లేకుండా ఉంటాయి. కాబట్టి పాశ్చరైజేషన్ చేసిన పాలనే మరిగించి తాగడం ఉత్తమం.

పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియాలు

పచ్చిపాలలో హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి సాల్మొనెల్లా, క్యాంపిలో బాక్టర్, క్రిప్టో పోరిడియం వంటి హానికరమైన బ్యాక్టీరియాలతో పచ్చిపాలు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దీనివల్ల ఆర్ధరైటిస్, గులేయిన్ బారే సిండ్రోమ్, హోమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటువ్యాధులైన అతిసారం, వాంతులు, డిహైడ్రేషన్, వికారం వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పాశ్చరైజేషన్ ద్వారా బ్యాక్టీరియాను చంపిన తర్వాతే ఆ పాలను వినియోగించడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం