Milk In Summer : వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు సింపుల్ చిట్కాలు-how to prevent milk from spoiling in summer without fridge simple methods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk In Summer : వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు సింపుల్ చిట్కాలు

Milk In Summer : వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు సింపుల్ చిట్కాలు

Anand Sai HT Telugu
Apr 27, 2024 03:00 PM IST

Milk In Summer Tips : వేసవిలో ఆహార పదార్థాలు పాడవడం అనేది సాధారణం. ఇందులో పాలు ఒకటి. వేసవిలో పాలు పాడవకుండా చూసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

పాలు పాడవకుండా చిట్కాలు
పాలు పాడవకుండా చిట్కాలు

వేసవిలో పాలు పాడైపోవడం సాధారణ సమస్య. ఇది వేసవి కాలంలో ప్రతిరోజూ వస్తుంది. పాలను బాగా మరిగించడం, చెడిపోకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం ఉత్తమం. అయినప్పటికీ కొన్నిసార్లు ఇది కూడా సరిపోదు. కొన్నిసార్లు పాలు వెంటనే చెడిపోతాయి. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే పాలు పాడవకుండా ఉంటాయి.

ఎండాకాలం మొదలైంది. పెరుగుతున్న వేడి కారణంగా రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడం అనేక సమస్యలను కలిగిస్తుంది. వేసవి వచ్చిందంటే ఆహార పదార్థాలు కూడా పాడవుతాయి. అందుకే ఈ రోజుల్లో వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాడైన ఆహారం తింటే అనేక ఆరోగ్య సమస్యలను చూస్తారు. ఇది మెుత్తం శ్రేయస్సుకు మంచిది కాదు.

వేసవిలో పాలు పాడైపోవడం అనేది ఈ సీజన్‌లో రోజూ వచ్చే సాధారణ సమస్య. చెడిపోకుండా ఉండాలంటే పాలను బాగా మరిగించి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం మంచిది. అయితే కొన్నిసార్లు ఇలా చేయడం కూడా సరిపోదు. ఎందుకంటే చాలా ఇళ్లకు కరెంటు సమస్య కూడా ఉంటుంది. వేసవిలో కరెంట్ కోతలు కూడా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా.. కొన్నిసార్లు ఫలితం ఉండదు. అటువంటి పరిస్థితిలో పాలు చెడిపోకుండా కాపాడుకోవడం చాలా కష్టం.

ఇలాంటప్పుడు శీతలీకరణ లేకుండా కూడా పాలు చెడిపోకుండా ఉండేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. మనందరం రోజూ వాడే వాటిలో పాలు ఒకటి కాబట్టి మళ్లీ మళ్లీ చెడిపోతే మన ఇంటి బడ్జెట్ కూడా దెబ్బతింటుంది. పాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకుండా 24 గంటలపాటు తేలికగా ఉంచే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..

పాలను 24 గంటల్లో 3 నుంచి 4 సార్లు మరిగించాలి. కానీ వేడి చేసేటప్పుడు, గ్యాస్ మంటను సరిగ్గా పెట్టాలి. 2-3 సార్లు మరిగిన తర్వాత మాత్రమే పొయ్యిని ఆపివేయండి. పాలు వేడి అయ్యాక చల్లారనివ్వాలి. వెంటనే తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

మీరు పాలు కాచినప్పుడు, పాత్ర శుభ్రంగా ఉందో లేదో జాగ్రత్తగా చెక్ చేయండి. శుభ్రపరిచిన తర్వాత మాత్రమే ఉపయోగించండి. దీని తరువాత గిన్నెలో పాలు జోడించే ముందు ఒక చెంచా లేదా రెండు చుక్కల నీటిని జోడించండి. ఇది పాలు దిగువకు అంటుకోకుండా చేస్తుంది.

ఒక్కోసారి పాలు స్టవ్ మీద పెట్టి మరిచిపోతాం. ఇది జరిగితే దానికి కొద్దిగా బేకింగ్ సోడా జోడించండి. ఎందుకంటే ఇది పాలు పెరుగుకుండా చేస్తుంది. పాలు మరిగేటప్పుడు, దానికి చిటికెడు బేకింగ్ సోడా వేసి, చెంచాతో బాగా కలపాలి. అయితే ఎక్కువ బేకింగ్ సోడా పాల రుచిని పాడు చేస్తుందని గుర్తుంచుకోండి.

ప్రస్తుతం నగరాల్లో ప్యాకెట్ పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాశ్చరైజ్డ్ పాలను వేడి చేయవలసిన అవసరం లేదు. ప్యాకెట్ పాలను ఎక్కువసేపు మరిగంచొద్దు. కంపెనీలు.. పాలను ప్యాకింగ్ చేయడానికి ముందు పూర్తిగా శుభ్రపరుస్తుంది. దీని కారణంగా అది బ్యాక్టీరియా లేకుండా భద్రపరచబడుతుంది.

మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. తెచ్చిన కొన్ని గంటల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువసేపు నిల్వ చేయాలంటే.. బ్యాగ్‌ను చల్లటి నీటిలో నానబెట్టండి. దీని కారణంగా ఇది 5 నుండి 6 గంటల వరకు సురక్షితంగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్