Health | క్షయ వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఇవి తినండి.. ఎందుకంటే..-suffering from tuberculosis eat these foods to recover fast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Suffering From Tuberculosis? Eat These Foods To Recover Fast

Health | క్షయ వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఇవి తినండి.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu
May 26, 2022 10:22 AM IST

క్షయవ్యాధితో పోరాడడం అంత సులభం కాదు. దగ్గు, అనారోగ్యం, బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలతో పోరాడుతున్నప్పుడు.. పోషకాహార లోపం ఏర్పడుతుంది. కాబట్టి చికిత్స తీసుకుంటున్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

క్షయ వ్యాధి
క్షయ వ్యాధి

Eat These Foods to Recover Fast | క్షయ (TB) అనేది ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. అంతేకాకుండా మెదడు, వెన్నెముక వంటి ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి చికిత్స చాలా అవసరం. చికిత్స సమయంలో వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా మీరు మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే.. టీబీ కారణంగా పలు లక్షణాలు మీలో పోషకాహార లోపం ఏర్పరుస్తాయి. కాబట్టి మీరు తినే ఆహారం శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఏ ఆహారాలు మీకు పోషకాలను అందించి.. రోగనిరోధకశక్తిని పెంచుతాయో తెలుసుకుందాం.

కిచిడి

కిచిడిని అన్నం, పప్పు, పలు కూరగాయలతో తయారు చేస్తారు. ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను అందిస్తుంది. పైగా కిచిడి సులభంగా జీర్ణం అవుతుందని.. టీబీ రోగులకు ఇది మంచి ఎంపిక అని తెలిసిన విషయమే.

సోయాబీన్

సోయాబీన్ టీబీ కారక బ్యాక్టీరియాతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పనీర్

పనీర్‌ను చిన్న ముక్కలుగా చేసి మంచి గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్​కు అధిక మూలం. ఇది కండరాలను నిర్మించడంలో.. బలాన్ని అందించడంలో సహాయపడుతుంది.

కూరగాయలు

మీరు త్వరగా కోలుకోవడంలో సహాయపడటానికి క్యారెట్, టొమాటోలు, చిలగడదుంపలు, బ్రోకలీ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధిని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుపచ్చని కూరగాయలను తినండి.

తృణధాన్యాలు

మీకు టీబీ ఉన్నట్లయితే వాటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. తృణధాన్యాలు విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇది మీకు శక్తివంతంగా ఉండటానికి, బద్ధకాన్ని అధిగమించడానికి సహాయపడతాయి.

పప్పులు, చిక్కుళ్లు

పప్పులు, చిక్కుళ్లు గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా టాక్సిన్​లను తొలగిస్తాయి. పుట్టగొడుగులు, గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, అవిసె గింజలు వంటి విత్తనాలు సెలీనియం, జింక్ రెండింటినీ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి మీ రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. టీబీ సంక్రమణను ఎదుర్కోవడంలో శరీరానికి మద్దతునిస్తాయి. చెర్రీస్, బ్లూబెర్రీస్ కూడా మన శరీరానికి మంచివి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్