తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Eggs: రోజుకో గుడ్డు తింటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కానీ అతిగా తింటే మాత్రం?

Benefits of Eggs: రోజుకో గుడ్డు తింటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కానీ అతిగా తింటే మాత్రం?

Galeti Rajendra HT Telugu

14 October 2024, 19:00 IST

google News
  • రోజుకి ఒక గుడ్డు తింటే మీ శరీరానికి అవసరమైన ప్రొటీన్ దొరుకుతుంది. కానీ.. గుడ్లని అతిగా తింటే మాత్రం అనర్థమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గుడ్లు
గుడ్లు

గుడ్లు

రోజుకు 1-2 కోడిగుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెల్లసొన ప్రోటీన్‌కి మూలం. గుడ్డులో విటమిన్ డి, బీ12,సెలీనియం, హెల్తీ కొవ్వులు వంటి కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యం, మానసిక ఇమ్యూన్ సిస్టమ్, ఎముకల బలానికి తోడ్పడతాయి.

గుడ్లు తినడం వల్ల గుండెకు మంచిగా ఉండే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా విటమిన్-ఎను కూడా అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజు గుడ్లు తినడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది, కండరాల పటిష్టత కూడా పెరుగుతుంది, శరీర నిర్మాణానికి కావలసిన పోషకాలు గుడ్లు ద్వారానే అందుతాయి.

అతిగా గుడ్లు తింటే?

కానీ.. అతిగా గుడ్లు తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రోజుకు 3-4 గుడ్లు కంటే ఎక్కువ తింటే కొవ్వు క్షీణించి లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనే చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచే అవకాశం ఉంది.

కొంతమంది వ్యక్తులకు గుడ్లలోని కొలెస్ట్రాల్ సమస్యలను కలిగించవచ్చు, అందువల్ల గుండె సమస్యలు ఉన్నవారు మితంగా గుడ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 1-2 గుడ్లు తినడం శరీరానికి ఎంతో మేలు.

గుడ్లు తింటే గోర్లు పెరుగుతాయ్

కానీ అతిగా గుడ్లు తింటే, కొవ్వు సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. ఎగ్స్ తినడం వల్ల గోళ్లు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే గుడ్లలోని విటమిన్ ఇ ప్రొటీన్లతో పాటు బయోటిన్ కూడా ఉంటుంది. కాబట్టి గోర్లు కూడా పెరుగుతాయి.

జిమ్ చేసే వారికి గుడ్లు ప్రోటీన్, కండరాల పెరుగుదలకుసహాయపడతాయి. గుడ్లు పూర్తిగా ప్రోటీన్ అందించే ఆహారం. కాబట్టి శారీరక శ్రమ చేసేవారు గుడ్లని తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా తెల్లసొన, కండరాల పునరుద్ధరణకు సహకరిస్తుంది. వ్యాయామం చేసిన తరువాత గుడ్లు తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి.

తదుపరి వ్యాసం