ORS drink and Kids: జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఓఆర్ఎస్ ద్రావణం తాగించడం మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారు
08 August 2024, 7:00 IST
- ORS drink and Kids: పిల్లలు, పెద్దలు ఎవరికి జ్వరం వచ్చినా ఓఆర్ఎస్ డ్రింక్‌ను కొనుక్కొని తాగేస్తారు. అయితే పిల్లలకు ORS ద్రావణాన్ని తాగించడం మంచిదో కాదో వైద్యులు వివరిస్తున్నారు.
పిల్లలకు ఓఆర్ఎస్ డ్రింకు తాగించవచ్చా?
ORS drink and Kids: ఓఆర్ఎస్ ద్రావణం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు లేదా విరేచనాలు, వాంతులు అయినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తగదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ పడకుండా ఓఆర్ఎస్ కాపాడుతుంది. అయితే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కూడా వైద్యుల సలహా అడగకుండానే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అధికంగా పట్టే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఓఆర్ఎస్ ద్రావణం ఎంత పడితే అంత తాగించడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు పిల్లల వైద్య నిపుణులు.
పిల్లలకు జ్వరం వచ్చిన ప్రతిసారీ ఓఆర్ఎస్ ఇవ్వడం సరికాదని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లలకు విరేచనాలు, డయేరియా వంటి పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నపుడు మాత్రమే ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వడం మంచిది. అలాగే వాంతులు చేసుకుంటున్న సమయంలో కూడా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ సమస్యల బారిన పడినప్పుడు పదేపదే ఒకేరోజులో ఎక్కువసార్లు ఓఆర్ఎస్ ద్రావణాన్ని పట్టడం మాత్రం మంచిది కాదు. ఇది శారీరక సమస్యలను పెంచే అవకాశం ఉంది. వైరస్ ద్రావణానికి బదులుగా కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు, పండ్ల రసాలు వంటివి పిల్లలకు తాగించడం ఉత్తమం.
ORS వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలు
జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పిల్లలకు పదేపదే వైరస్ తాగించడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వారిలో వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు ఓఆర్ఎస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. అలాగే వారు తీవ్ర అలసట, వాంతులు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. వైరస్ అధికంగా తాగిన పిల్లల్లో కొన్నిసార్లు శ్వాస సమస్యలు కూడా వస్తాయి. కళ్ళల్లో వాపు లక్షణాలు కనిపిస్తాయి. వికారంగా అనిపించడం, వారికి అధికంగా దాహం వేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆకలి కూడా వేయదు. కాబట్టి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ద్రావణాన్ని పట్టాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ORS ద్రావణాన్ని అధికంగా సాగించడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా జ్వరం వచ్చిన ప్రతిసారి వైరస్ తాగించాల్సిన అవసరం లేదు. కేవలం జ్వరంతోపాటు వాంతులు, విరేచనాలు వంటివి ఉన్నప్పుడే ఓఆర్ఎస్ ను సాగించడం ఉత్తమం.
జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఏమి తినిపించాలి?
జ్వరం వచ్చిన పిల్లలకు కొబ్బరినీళ్లు, పండ్ల జ్యూసులు వంటివి అధికంగా ఇవ్వాలి. గంజి తాగించాలి. తేలికపాటి అల్పాహారాన్ని తినాలి. అలాగే పండ్లు, కూరగాయలు వంటి వాటితో చేసే జ్యూసులు తినిపించడం ఉత్తమం. అంతే తప్ప ప్రతిదానికి ఓఆర్ఎస్ మాత్రమే పరిష్కారం అని మాత్రం అనుకోవద్దు.
టాపిక్