Special Trains for Navaratri : కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయానికి ప్రత్యేక రైళ్లు
15 September 2022, 10:30 IST
- IRCTC Special Trains for Navaratri : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా ప్రారంభించిన భారత్ గౌరవ్ చొరవ కింద జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా మాతా వైష్ణో దేవి కోసం `నవరాత్రి స్పెషల్ టూరిస్ట్ ట్రైన్`ని ప్రారంభించినట్లు ప్రకటించింది. మరి దీని వివరాలు ధరలు, మార్గాలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC Special Trains for vaishno Devi temple
IRCTC Special Trains for Vaishnodevi Temple : వైష్ణో దేవి ఆలయానికి ప్రత్యేక పర్యాటక రైలు సెప్టెంబర్ 30, 2022న కత్రాకు తన తొలి పరుగును ప్రారంభించనుంది. రెండు ప్రత్యేక AC రైళ్లలు నాలుగు రాత్రులు, ఐదు రోజులు ఉంటాయి. ఈ రైళ్లు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. 11 ప్రత్యేక 3 టైర్ AC కోచ్‌లను కలిగి ఉంటాయి. ఇవి 600 మంది పర్యాటకులకు వసతి కల్పిస్తాయి.
ధర
* IRCTC టూర్ ప్యాకేజీ ఒక్క టూరిస్ట్‌కు రూ. 13,780 అవుతుంది.
* డబుల్ ఆక్యుపెన్సీకి.. ఒక్కో వ్యక్తికి రూ.11,990.
* 5-11 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారు రూ. 10,795
* మీరు మీ కుటుంబంతో లేదా సమూహంతో కలిసి టూర్‌కు వెళ్తుంటే.. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉంటే.. మీరు ఒక్కొక్కరికి రూ.12,990 చెల్లించాలి.
ఈ నవరాత్రి ప్రత్యేక పర్యాటక రైలు గురించి
ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ టూరిస్ట్ రైలు. దీనిలో AC కోచ్‌లు, ఒక ప్యాంట్రీ కారు, రెండు SLRలు కూడా ఉంటాయి. తాజాగా వండిన శాఖాహార భోజనం వారి సీట్లలో ఉన్న అతిథులకు బోర్డులో అందిస్తారు.
రైలులో ప్రయాణీకుల వినోదం, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. పర్యాటకుల కోసం శుభ్రమైన టాయిలెట్ల నుంచి సిసిటివి కెమెరాలు, ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డులు మెరుగైన భద్రతా ఫీచర్లు కూడా అందించారు.
టికెట్ బుక్ చేసుకోవడం ఎలా?
ప్రయాణీకులు IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించి అక్కడ మరింత సమాచారాన్ని పొందవచ్చు. https://www.irctctourism.com బుకింగ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
"అన్నీ కలిపిన ప్యాకేజీ ధరలో ఏసీలో రైలు ప్రయాణం, ఏసీ హోటళ్లలో రాత్రి బస, అన్ని భోజనాలు (వెజ్ మాత్రమే), అన్ని బదిలీలు, బస్సులు చూడటం, ప్రయాణ బీమా, గైడ్ సేవలు మొదలైనవి పొందవచ్చు. అవసరమైన అన్ని ఆరోగ్య జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. టూర్ సమయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని అందించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి భోజన సేవ తర్వాత వంటగదిని శుభ్రపరచడం, జరుగుతుంది" అని IRCTC CPRO ఆనంద్ కుమార్ ఝా తెలిపారు.