తెలుగు న్యూస్  /  Telangana  /  Here Is Dussehra Holidays 2022 For Telangana Andhra Pradesh Schools And Colleges

Dussehra Holidays 2022 : ఈసారి దసరా సెలవులు భారీగానే ఉన్నాయిగా

HT Telugu Desk HT Telugu

12 September 2022, 20:02 IST

    • Telangana Dussehra Holidays : తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే దసరాకు భారీగానే సెలవులు వచ్చాయి. ఈసారి విద్యార్థులకు 16 రోజులు హాలి డేస్ వస్తాయి.
దసరా సెలవులు
దసరా సెలవులు (unplash)

దసరా సెలవులు

తెలంగాణ‌లో స్కూల్‌, కాలేజీ విద్యార్థుల‌కు ఈసారి దసరా సెలవులు ఎక్కువే వస్తున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అంటే 14 రోజులు. అయితే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లుపుకొని మొత్తం 16 రోజులు సెలవులు అవుతాయి. గతంలో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవుల గురించి ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

CM Revanth Reddy Notices : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు

ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజుగా పెర్కొంది. ఏప్రిల్ 25 నుండి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుండి 28 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఉండగా.. నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను షెడ్యూల్ చేశారు.

ఏపీలో దసరా సెలవులు

ఏపీలోనూ దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6 వరకు ప్రకటించారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలల్లో దసరా సెలవులు అక్టోబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16వరకు ఉంటాయి.

ఏటా జూన్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరం ఈ ఏడాది రెండు వారాలు ఆలస్యంగా జులైకు మారింది. ఇతర కారణాల వల్ల దాదాపు 20రోజులు వెనక్కి వెళ్లింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ముగుస్తాయి. ప్రతి వారం సగటున 48 పీరియడ్లు ఉండేలా ప్రణాళిక విడుదల చేశారు. హైస్కూళ్లలో సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పీరియడ్లలో బోధించాల్సి ఉంటుంది.