తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In Jammu Kashmir : జమ్ముకశ్మీర్​లో భూకంపం.. 3 రోజుల్లో 7వసారి!

Earthquake in Jammu Kashmir : జమ్ముకశ్మీర్​లో భూకంపం.. 3 రోజుల్లో 7వసారి!

Sharath Chitturi HT Telugu

26 August 2022, 6:42 IST

    • Earthquake in Jammu Kashmir today : జమ్ముకశ్మీర్​లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ ప్రాంతంలో భూమి కంపించడం.. గత మూడు రోజుల్లో ఇది 7వ సారి.
జమ్ముకశ్మీర్​లో భూకంపం.. మూడు రోజుల్లో 7వ సారి..!
జమ్ముకశ్మీర్​లో భూకంపం.. మూడు రోజుల్లో 7వ సారి..! (Mint)

జమ్ముకశ్మీర్​లో భూకంపం.. మూడు రోజుల్లో 7వ సారి..!

Earthquake in Jammu Kashmir today : జమ్ముకశ్మీర్​లో భూకంపం పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా.. మరోమారు భూకంపం సంభవించింది. ఫలితంగా.. జమ్ముకశ్మీర్​లో గత మూడు రోజుల్లో 7సార్లు భూమి కంపించింది.

ట్రెండింగ్ వార్తలు

London-Singapore flight : ఆకాశంలో ఉండగా విమానంలో భారీ కుదుపు.. ఒకరు మృతి- 30మందికి గాయాలు!

Chitta Ranjan Dash : ‘ఇప్పటికీ.. ఎప్పటికీ నేను ఆర్​ఎస్​ఎస్​ సభ్యుడినే’- హైకోర్టు జడ్జి!

Ebrahim Raisi death : ఇరాన్​ అధ్యక్షుడు రైసీని ఇజ్రాయెల్​ చంపేసిందా?

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

తాజాగా.. జమ్ముకశ్మీర్​లోని కాట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 3.4గా నమోదైంది. ఈ వివరాలను ఎన్​సీఎస్​(నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ) వెల్లడించింది.

భూమికి 5కిమీల దిగువన జమ్ముకశ్మీర్​లో భూకంపం సంభవించింది.

<p>జమ్ముకశ్మీర్​లో భూకంపం</p>

3 రోజుల్లో 7వసారి..

ఎన్​సీఎస్​ డేటా ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు.. కాట్రాలో తొలిసారి భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైంది.

Jammu Kashmir earthquake : ఇక జమ్ముకశ్మీర్​లో భూకంపం.. రెండోసారి మంగళవారం తెల్లవారుజామునే నమోదైంది. దోడా ప్రాంతంలో వచ్చిన భూకంపం.. రికార్ట్​ స్కేలుపై 2.6 తీవ్రతగా ఉంది. మూడోవది.. అదే రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు సంభవించింది. తీవ్రత.. రిక్టార్​ స్కేలుపై 2.8గా నమోదైంది.

జమ్ముకశ్మీర్​లో నాలుగో భూకంపం.. మంగళవారం ఉదయం.. ఉధంపూర్​కు ఆగ్నేయం దిశగా వచ్చింది. రిక్టార్​ స్కేలుపై తీవ్రత 2.9గా నమోదైంది.

ఆ తర్వాత.. జమ్ముకశ్మీర్​లో ఐదవ భూకంపం.. బుధవారం వెలుగులోకి వచ్చింది. కాట్రాలో రాత్రి 11:04 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని నిమిషాల తర్వాత.. అంటే 11:52 గంటలకు.. కాట్రాలోనే మరోమారు భూకంపం నమోదైంది.

మహారాష్ట్రలో కూడా..

Maharashtra earthquake : మహారాష్ట్రలో సైతం భూకంపం సంభవించింది. మొత్తం మీద.. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు అక్కడ భూమి కంపించింది.

శుక్రవారం 2:21 గంటలకు.. 3.9 తీవ్రతతో మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. భూమికి 10కి.మీల దిగువన భూమి కంపించింది. గురువారం కోల్హాపూర్​లో 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది.

దేశంలో భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే.. ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లక్నోలో భూకంపం సంభవించింది. గత శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ ప్రకారం.. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. భూమి నుంచి 82 కిలోమీటర్ల దిగువన భూప్రకంపనలు నమోదయ్యాయి. లక్నోలోని ఉత్తర- ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది.

Earthquake in Lucknow : లక్నో భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

శనివారం 1:12 గంటలకు లక్నో భూకంపం నమోదైంది.

ఈ ఘటనకు ఒకరోజు.. అంటే గత శుక్రవారమే ఉత్తరాఖండ్​లోని పితోర్​గఢ్​ ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టార్​ స్కేలుపై 3.6గా నమోదయ్యాయి. మిట్ట మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

జమ్ముకశ్మీర్​లోనూ 3.1 మ్యాగ్నిట్యూడ్​తో భూకంపం సంభవించింది.

తదుపరి వ్యాసం