తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tiger Day। అడవికి రాజు సింహం అయితే మరి పులి? పులి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూడండి!

Tiger Day। అడవికి రాజు సింహం అయితే మరి పులి? పులి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూడండి!

Manda Vikas HT Telugu

29 July 2023, 11:52 IST

google News
    • International Tiger Day 2023: ఈరోజు పులుల దినోత్సవం సందర్భంగా పెద్దపులి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను (interesting facts about tiger) ఇక్కడ తెలుసుకోండి.
interesting facts about tiger
interesting facts about tiger (istock)

interesting facts about tiger

International Tiger Day: సాధారణంగా అడవికి రాజు ఏది అంటే సింహం అని చెబుతారు? మరి సింహంతో సమానమైన, అంతకు మించిన సామర్థ్యం కలిగిన పులిని ఏం అనాలి? నిజానికి పులి మాత్రమే అడవిలో జీవించే ప్రాణి, సింహం సాధారణంగా గడ్డి భూములు, సవన్నాలలో నివసించే ప్రాణి. మరి అడవికి అసలైన రాజు ఏదో మీరే అర్థం చేసుకోండి. పులి చాలా అందమైనది, అలాగే క్రూరమైనది కూడా. దీనిని క్రూర మృగాల జాబితాలో చేర్చారు. అయితే మనిషి కంటే క్రూరమైనది కాదు అనే వాదన ఉంది. ఎందుకంటే మానవ చర్యలతో నేడు పులులు అనేవి అంతరించిపోతున్నాయి. అందుకే, ఈ భూమి మీద అందమైన, గంభీరమైన జీవులు అయినటువంటి పులల సంరక్షణ కోసం ప్రతీ ఏడాది జూలై 29న 'అంతర్జాతీయ పులుల దినోత్సవం' గా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. పులుల సంరక్షణ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం ఈరోజుకు ఉన్న ప్రత్యేకత.

ఈరోజు పులుల దినోత్సవం సందర్భంగా పెద్దపులి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను (interesting facts about tiger) ఇక్కడ తెలుసుకోండి.

రాయల్ బెంగాల్ టైగర్ చాలా పెద్దది

ఇతర పులుల కంటే రాయల్ బెంగాల్ టైగర్లు అతి పెద్దవి. వీటిలో మగ పులులు 300 కిలోగ్రాముల వరకు బరువును. ఇంతటి బరువుతో అది ఏ మామూలు జీవి మీదనైనా కూర్చుంటే దీని బరువుకే అది ఊపిరి ఆడకుండా చనిపోతుంది.

పులి ఒక్క పంజాతో చంపేయగలదు

పులుల శరీర పరిమాణాన్ని పక్కన పెడితే, వాటి ముందు కాళ్లను చూడండి, పులి ఎప్పుడూ దాని పంజా దెబ్బతో దాడి చేస్తుంది. పులి పంజా దెబ్బ చాలా బలంగా ఉంటుంది. దాని ఒక్క పంజా దెబ్బతోనే ఒక వ్యక్తిని లేదా జంతువును చంపేయగలదు. ఒక వేళ చావు మిస్ అయితే ఎముకలు విరగటం ఖాయం, చావు భయంతోనే చచ్చిపోవచ్చు కూడా.

సైలైంట్ కిల్లర్

పులులను సైలెంట్ కిల్లర్లుగా వర్ణిస్తారు, ఎందుకంటే చాటు నుంచి వచ్చి ఆకస్మికంగా దాడి చేస్తుంది. వేటాడేటపుడు పులులు చాలా నిశ్శబ్దంగా నడుస్తాయి. ఇందుకోసం మృదువైన కాలి ప్యాడ్‌లను కలిగి ఉంటాయి. పులి చారలు దాని చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసిపోయేలా మభ్యపెట్టేలా పనిచేస్తాయి, ఇలా నెమ్మదిగా ఎరను వెంబడించి, మెరుపుదాడి చేస్తాయి. పులులు నిశాచర జీవులు కూడా ఎక్కువగా రాత్రి వేళలోనే వేటకు వెళ్తుంది. ఈ వేటలో భాగంగా సుమారు 10- 20 కిమీ ప్రయాణిస్తుంది.

పులులు 25 సంవత్సరాలు జీవిస్తాయి

పులుల ఆయుర్దాయం 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది, అయినప్పటికీ, చాలా పులులు 20 ఏళ్లలోపే మరణిస్తాయి. మరో విచారకరమైన విషయం ఏమిటంటే, పులి పిల్లలు గుడ్డిగా పుడతాయి, పుట్టిన వాటిలో కొన్ని మాత్రమే జీవించి ఉంటాయి. పులి పిల్లలు కేవలం తమ తల్లి సువాసనను మాత్రమే అనుసరిస్తాయి. చాలా పులి పిల్లలు ఆకలితో లేదా చలికి చనిపోతాయి. కొన్నిసార్లు ఆడపులి, మగపులికి సంభోగానికి అనుమతిని ఇవ్వకపోతే అవి దాని పిల్లలను తినేసి ఆడపులిని లోబర్చుకుంటాయి. ఇలా కూడా పులి పిల్లలు చనిపోతాయి.

పులి మూత్రం వాసన- ఘుమఘుమ

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పులుల మూత్రం వాసన, అచ్ఛంగా వెన్న పూసిన పాప్‌కార్న్ వాసన లాగా ఉంటుందట, అయితే ఈ వాసన చూడటాని ప్రయత్నించవద్దు. ఎందుకంటే పులులు తమకోసం ప్రత్యేకమైన టెరిటరీలను ఏర్పర్చుకొని జీవిస్తాయి. తమ భూభాగంలోకి ఏదైనా వస్తే, ఇక అంతే.

పులుల సమతుల్య ఆహారం

పులులు వైవిధ్యమైన ఆహారాన్ని తింటాయి, ఎప్పుడూ ఒకేరకమైన ఆహారాన్ని తినవు. అన్ని రుచులను ఆస్వాదిస్తాయి. అడవి పంది, జింక, ఎలుకలు, ఎలుగుబంటి, పక్షుకు, ఖడ్గమృగం, మొసలి, గేదె, చిరుతపులి వంటి వాటిలో దేనితో అయినా విందు చేసుకోగలవు. అలాగే దాని మార్గంలో వచ్చే ఏ జీవినైనా చంపి తింటాయి. చేపలను కూడా తింటుంది. , ఎందుకంటే పులులకు ఈతకొట్టడం ఇష్టం సుమారు 30 కిమీ దూరం వరకు ఈతకొట్టగలవు, ఈ క్రమంలో ఆకలి వేస్తే చేపలను తినేస్తాయి.

పులులకు మనిషి ఆహారం కాదు

పులులు సాధారణంగా మనుషులను ఆహారంగా పరిగణించవు. కానీ, మనిషి వాటికి ముప్పు అని అనిపించినపుడు చంపి తినేందుకు వెనకాడవు. అయితే ఇలా ఒకసారి మనిషి రక్తం మరిగిన పులి, మళ్లీ మళ్లీ మనిషి మాంసం కోసం నోరూరుతాయి. అయినప్పటికీ వాటి భూభాగంలోకి మనిషి చొరబడకపోతే ఏం చేయవు. పొరపాటున ఒకవేళ మనిషికి పులి ఎదురైతే భయంతో పరుగెత్తకుండా, పులిని కన్నార్పకుండా చేస్తూ వెనకకు నడుచుకుంటూ కనుమరుగవడం సరైన చర్య.

తదుపరి వ్యాసం