తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Godhuma Dosa Recipe : ఇన్​స్టంట్​గా తయారు చేసుకోగలిగే గోధుమ దోశ.. రెసిపీ ఇదే..

Instant Godhuma Dosa Recipe : ఇన్​స్టంట్​గా తయారు చేసుకోగలిగే గోధుమ దోశ.. రెసిపీ ఇదే..

24 January 2023, 6:00 IST

    • Instant Godhuma Dosa Recipe : ఇంట్లో గోధుమ పిండి, బియ్యం పిండి ఉంటే చాలు. మీరు వేడి వేడి దోశను తయారు చేసుకోవచ్చు. అదేంటి గోధుమ పిండితో దోశ అనుకుంటున్నారా? అయితే ఇది మీరు చదవాల్సిందే. ఈ సింపుల్, ఇన్​స్టంట్ రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే.
గోధుమ దోశ
గోధుమ దోశ

గోధుమ దోశ

Instant Godhuma Dosa Recipe : మీరు ఉదయాన్నే క్రిస్పీగా, టేస్టీగా, సులభంగా తయారు చేసుకోగలిగే దోశ గురించి చూస్తున్నట్లయితే మీకు గోధుమ దోశ పర్​ఫెక్ట్ బ్రేక్​ఫాస్ట్. అవును గోధమ పిండితో మీరు అదిరే టేస్టీ దోశను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మీ ఇంట్లో పిండి ఉంటే చాలు.. పది నిముషాల్లో మీరు దీనిని తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

కావాల్సిన పదార్థాలు

* గోధుమ పిండి - 1 కప్పు

* బియ్యం పిండి - 1/2 కప్పు

* ఉల్లిపాయలు - 1/2 కప్పు సన్నగా తరిగినవి

* పచ్చి మిర్చి - 1 సన్నగా తరిగినది

* అల్లం - 1 టీస్పూన్ (తురిమిన)

* కరివేపాకు - 4-5 సన్నగా తరిగినవి

* ఇంగువ - 1/2 టీస్పూన్

* పెప్పర్ - 1/2 టీస్పూన్

* ఉప్పు - రుచికి మెత్తగా

* నూనె - దోశ తయారీకి

గోధుమ దోశ తయారీ విధానం

గోధుమ దోశను తయారు చేయడానికి.. అన్ని పదార్థాలను కలపండి. ఉండలు లేకుండా పిండిని దోశ పిండిలా నీరు పోస్తూ కలపండి. దీనిని పది నిముషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి.. అది వేడి అయ్యాక దానిమీద పిండి వేయండి. అంచుల చుట్టూ.. అట్టు మీద నూనె వేయండి. దోశను రెండు వైపులా ఫ్రై చేయండి. అది రోస్ట్ అయిన తర్వాత.. తీసేయండి. దీనిని మీరు టొమాటో, ఉల్లిపాయ చట్నీతో లాగించేయవచ్చు.

తదుపరి వ్యాసం