jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ కామర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాతర!
18 September 2022, 16:03 IST
- E Commerce Jobs: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 అంటే దీపావళి వరకు దాదాపు 30,000 తాత్కాలిక ఉద్యోగాలను తీసుకోనున్నట్లు సమాచారం.
E Commerce Jobs
పండుగ సీజన్ ప్రారంభమవుతుండడంతో ఈ కామర్స్ సంస్థలు భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 అంటే దీపావళి వరకు దాదాపు 30,000 తాత్కాలిక ఉద్యోగాలను తీసుకోనున్నట్లు సమాచారం. లాజిస్టిక్స్‌లో సాఫీగా డెలివరీ జరగడం కోసం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మ్యాన్‌పవర్ అందుబాటులో ఉండడం వల్ల డెలివరీలు ఆలస్యం కాకుండా ఉంటాయని సంస్థలు ఆలోచిస్తున్నాయి.
దీపావళి సమయంలో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా మంది వినియోగదారులు ఈ - షాపింగ్ చేస్తుంటారు. దీంతో లాజిస్టిక్స్ కేంద్రాలు ప్రోడక్ట్స్ రీసివ్ చేసుకోవడానికి, క్రమబద్ధీకరించడానికి, స్క్రీన్ చేయడానికి అలాగే రవాణా సంబంధించి 24X7 పని చేయాల్పి ఉంటుంది. ఇక SD+ సెంటర్‌లు ఆర్డర్‌లను నిరంతరం ప్రాసెస్ చేస్తునే ఉంటాయి. రాత్రిళ్ళు అమోందించిన ఆర్డర్‌లు మరుసటి రోజు ఉదయం పంపడానికి సిద్ధం చేయాల్పి ఉంటుంది. "ఈ దీపావళికి భారతదేశంలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఆర్డర్ప్ వస్తుంటాయి. ఈ ఆర్డర్స్ 1-2 రోజుల్లో డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులను ఓ కొత్త అనుభవాన్ని ఇవ్వడం కోసం మేము అప్‌గ్రేడ్ సిద్దమవుతున్నామని" ఓ ప్రముఖ ఈ కామర్స్ అధికారి ఒకరు తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి తిరిగి రావడం, వినియోగం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో, దేశం ఫ్రంట్‌లైన్ కార్మికుల డిమాండ్‌లో వేగవంతమైన వృద్ధిని సాధిస్తుంది. FY 2022లో, బెటర్‌ప్లేస్ ఫ్రంట్‌లైన్ ఇండెక్స్ రిపోర్ట్ 2022 ప్రకారం భారతదేశంలో 8 మిలియన్ ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఈ నివేదిక 2020- 2022 మధ్య జరిగిన ఉద్యోగాల నియామకాన్ని విశ్లేషించింది.
ఈ నివేదిక జూన్ 2020 నుండి జూలై 2022 వరకు BetterPlace ప్లాట్‌ఫారమ్ ద్వారా సేకరించబడిన డేటా ఆధారంగా రూపొందించబడింది. భారతదేశంలోని ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్‌లో నియామకం, డిమాండ్, అట్రిషన్, మైగ్రేషన్, జీతం, అప్‌స్కిల్లింగ్ ట్రెండ్‌ల వివరణాత్మక డేటా అందించారు. మహమ్మారి అనంతర ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రిటైల్ వినియోగంతో, FY 2022 Q2లో వ్యయం వేగంగా పెరగడం వల్ల ఫ్రంట్‌లైన్ కార్మికులకు డిమాండ్ భారీగా పెరిగింది. డెలివరీ, రిటైల్ విభాగాలు. లాజిస్టిక్స్, మొబిలిటీ తర్వాత ఫ్రంట్‌లైన్ కార్మికుల డిమాండ్‌కు ఈ-కామర్స్ సంస్థలు అత్యధిక దోహదపడుతున్నాయి.