AP Govt MEO Jobs: విద్యాశాఖలో కొత్తగా 679 ఎంఈవో- 2 ఉద్యోగాలు
17 September 2022, 19:37 IST
- ap education department jobs 2022: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 679 ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ విద్యాశాఖలో ఉద్యోగాలు,
AP Schools MEO Recruitment 2022: విద్యాశాఖకు సంబంధించిన ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఎంఈవో 2 పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈవో-1 పేరిట 13 పోస్టులు, ఎంఈవో-2 పేరిట 679 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న 666 ఎంఈవో పోస్టులకు అదనంగా 13 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే 679 ఎంఈఓ 2 పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక నుంచి ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఈవోలు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక నుంచి ఎంఈవో - 1 గా మార్పు చేశారు.
పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర అంశాల పర్యవేక్షణకు గానూ కొత్త పోస్టులను కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. కొత్తగా ఎంపికయ్యే ఎంఈవోలకు అకడమిక్ వ్యవహరాలు అప్పగించే అవకాశముంది. ఇప్పటికే ఎంఈవోలుగా ఉన్నవారు పరిపాలన వ్యవహరాలు చూసుకుంటారని తెలుస్తోంది.
పని భారానికి చెక్..?
కొత్త పోస్టుల మంజూరుతో ప్రస్తుతం పని చేస్తున్న ఎంఈవోలపై పని భారం తగ్గే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. ఫలితంగా సమస్యలపై దృష్టిసారించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పోస్టులను ఎంఈడీ పూర్తి చేసిన వారితో భర్తీ చేస్తారా..? లేక డిగ్రీ లేదా బీఈడీ పూర్తి చేస్తారా అనేది నోటిఫికేషన్ విడుదల చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.