తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  8 Workers Killed In Ahmedabad: లిఫ్ట్ కుప్పకూలి 8 మంది దుర్మరణం

8 workers killed in Ahmedabad: లిఫ్ట్ కుప్పకూలి 8 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu

14 September 2022, 16:31 IST

google News
  • 8 workers killed in Ahmedabad: నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన ప్రదేశం
ప్రమాదం జరిగిన ప్రదేశం

ప్రమాదం జరిగిన ప్రదేశం

8 workers killed in Ahmedabad: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఆ లిఫ్ట్ లో 8 మంది కూలీలున్నారు. ఆ భవన నిర్మాణంలో పాలు పంచుకోవడానికి వచ్చిన ఆ కూలీలు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

8 workers killed in Ahmedabad: ఏడో అంతస్తు నుంచి..

అహ్మదాబాద్ లో గుజరాత్ యూనివర్సిటీ సమీపంలో ఈ భవనం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ లో పైకి వెళ్తున్న కూలీలు.. ఆ లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, మొత్తం 8 మంది కూలీలు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏడవ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు దూసుకువచ్చి, నేలకు ఢీ కొన్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బిల్డర్ నిబంధనలను ఉల్లంఘించారా? అనే విషయంపై కూడా విచారణ జరుగుతుందన్నారు.

తదుపరి వ్యాసం