Healthy Weightloss: ఈ పిల్ల చూశారా, ఆరోగ్యంగా తింటూ బరువు తగ్గింది, రంగు పెరిగింది
08 August 2024, 14:51 IST
- Healthy Weightloss: ఒక వ్యక్తి బరువును నియంత్రించడం ద్వారా ఎంత అందంగా, ఆరోగ్యంగా మారవచ్చో సారా అలీఖాన్ ఒక ఉదాహరణ. అలా ఒక అమ్మాయి ఎలా శస్త్రచికిత్స చేసుకోకుండానే ఆరోగ్యంగా బరువు తగ్గి, మేని రంగును కూడా పెంచుకుంది.
ఆరోగ్యంగా సన్నగా మారడం ఎలా?
పైన ఇచ్చిన ఫోటోల్లో ఉన్న అమ్మాయిలు వేరు వేరు అనుకుంటారు ఎంతోమంది. నిజానికి ఆ ఇద్దరూ ఒక్కరే. ఈమె ఒక డాక్టర్. తాను లావుగా ఉన్నప్పుడు ఉన్న ఫోటోతో పాటూ, ఇప్పుడు తాను ఎలా ఉందో ఆ ఫోటోను కూడా పోస్టు చేసింది. తాను ఎలాంటి శస్త్రచికిత్స తీసుకోకుండా ఇలా మెరుపుతీగలా మారినట్టు చెబుతోంది.
ఎవరికైనా బరువు పెరగడం, తగ్గడం అంత సులువు కాదు. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేవలం కొన్ని గ్రాములు పెరిగిన బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. అథ్లెట్లతో పాటు ఏ వ్యక్తికైనా తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గించే ప్రయాణంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఆరోగ్యంగా బరువు తగ్గిన వ్యక్తి ఈ ఫోటోలో కనిపిస్తున్న డాక్టర్. ఈమె అనస్థీషియాలజిస్ట్. ఆమె 120 కిలోల బరువుతో ఉండేది. ఆ బరువును ఆమె ఆరోగ్యంగా తగ్గించింది. దీని వల్ల ఆమె మేని ఛాయ కూడా ప్రకాశవంతంగా మారింది.
బరువు తగ్గే విషయానికి వస్తే, చాలా మంది ఈ పనిని అసాధ్యంగా భావిస్తారు. కానీ ఈ డాక్టరమ్మ చెప్పిన ప్రకారం అది అంత కష్టం కాదు. ఈమెకు లావుగా ఉన్నప్పుడు ఎముక, చర్మం, పీరియడ్స్ సమస్యలు అధికంగా వచ్చేవి. అప్పుడు బరువు తగ్గమని ఇతర డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చారు. అధిక బరువు వల్ల ఆమె చర్మం కూడా నల్లగా మారిపోయింది. పీరియడ్స్ కూడా సక్రమంగా వచ్చేవి కాదు. కాబట్టి బరువును తగ్గించడం వల్ల అన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఊబకాయానికి, పీసీఓఎస్ కు ఉన్న సంబంధం
పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు అధిక బరువు పెరుగుతారు. వారిలోనికొవ్వు కణాల నుంచి ఈస్ట్రోజెన్ విడుదలవుతుంది. అధిక బరువు కారణంగా కీళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. గొంతు చుట్టూ చర్మం నల్లబడటం, ఇన్సులిన్ నిరోధకత వల్ల కలిగే అకాంతోసిస్ నైగ్రికాన్స్ వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ శరీర అనారోగ్యాన్ని సూచిస్తాయి.
బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ లేదా కొవ్వు తగ్గించే మాత్రలు ఈ డాక్టరమ్మ తీసుకోలేదు. బరువు తగ్గడానికి ఆమెకు ఏడాది సమయం పట్టింది. అలాగే టోన్డ్ బాడీని పొందడానికి కొన్ని నెలలు పట్టింది.
చర్మం రంగు ఎలా మారింది?
నిజానికి ఈ డాక్టరమ్మ రంగు తక్కువగానే ఉండేది. ఆమెకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు బరువు పెరగడం ప్రారంభించింది. ఆమె ముఖం, మెడ నల్లగా మారడం ప్రారంభమైంది. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న తరువాత ఈ డాక్టరమ్మ తన లైఫ్ స్టైల్ మార్చేసింది. ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ప్రతిరోజూ వ్యాయామం చేసేది. హార్మోన్ల అసమతుల్యత సమస్యకు చికిత్స తీసుకుంది.
బరువు తగ్గేందుకు ఏం తినాలి?
బరువు తగ్గేందుకు ఎలా సర్జరీలు, మందుల జోలికి పోకుండా ఆహారం, వ్యాయామం మీదే ఆధారపడమని చెబుతోంది ఈ డాక్టరమ్మ. ఆమె పూర్తిగా తెల్లన్నం తినడం మానేసింది. చిరుధాన్యాలతో చేసిన ఆహారాలను మాత్రమే తినడం ప్రారంభించింది. చక్కెర నిండిన ఆహారాలు, వేయించిన ఆహారాలు పూర్తిగా మానేసింది. తాను తినే ఆహారంలో అధిక ఫైబర్, ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తినేది. పండ్లు, కూరగాయలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకుంది. అలాగే ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్ వంటివి కచ్చితంగా చేసేది. ఇలా దాదాపు ఏడాది పాటూ కష్టపడితే ఆమె బరువు తగ్గింది. ఇక టోన్డ్ బాడీ కోసం కొన్ని రకాల వ్యాయామాలు ప్రత్యేకంగా చేసింది. చివరకు మెరుపుతీగలా మారింది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆమె మేని రంగు కూడా పెరిగింది. మీరు కూడా ఈ డాకర్ పద్ధతిని పాటించి చూడండి అందంగా, ప్రకాశవంతంగా మారిపోవచ్చు.
టాపిక్