తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Fruit: ఈ పండు పోషకాల పవర్ హౌజ్, ఉదయాన్నే తింటే లాభాలివే

Best Fruit: ఈ పండు పోషకాల పవర్ హౌజ్, ఉదయాన్నే తింటే లాభాలివే

15 October 2024, 6:30 IST

google News
  • Best Fruit: బొప్పాయిని రోజూ అల్పాహారంలో లేదా ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిగడుపున లేదా స్నాక్స్ సమయంలో తింటే ఏం జరుగుతుందో తెల్సుకోండి.

పండుతో లాభాలు
పండుతో లాభాలు (freepik)

పండుతో లాభాలు

ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా ఉండాలి. అలా మీ శరీరానికి మేలు చేసే అలవాట్లలో బొప్పాయిని పరిగడుపున తినడం కూడా ఒకటి. ఈ చిన్న అలవాటుతో అనేక రోగాల నుంచి ఉపశమనం దొరుకుతుంది. బొప్పాయిని శరీరానికి అవసరమైన పోషకాలకు శక్తి కేంద్రం అంటారు. విటమిన్లు ఎ, సి, ఇ నుండి సూక్ష్మపోషకాలు ఫోలేట్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయిందులో. బొప్పాయి జీర్ణక్రియకు కూడా మంచిది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా బొప్పాయి తినడం ప్రారంభించండి. రోజూ పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

మలబద్ధకం, జీర్ణ సమస్యలు:

మలబద్ధకం, ఆహారం జీర్ణం కాక అజీర్తి సమస్యలు ఉంటే పరిగడుపున బొప్పాయి తినండి.ఇందులో ఉండే పెపిన్ ఎంజైమ్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయిని ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేయడం సులభం అవుతుంది. కావాలనుకుంటే సాయంత్రం స్నాక్స్ లో కూడా బొప్పాయి చేర్చుకోవచ్చు.

పోషకాలు గ్రహించడం

సాయంత్రం తర్వాత బొప్పాయి తినాలనుకుంటే మీరు భోజనం చేశాక రెండు గంటల విరామం తీసుకోండి. దీనివల్ల పోషకాలు పూర్తిగా శరీరం గ్రహించేలా బొప్పాయి చేస్తుంది. పోషకాల శోషణ వేగంగా జరిగేలా చూస్తుంది.

పీచు శాతం

బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బొప్పాయిని పరగడుపున తింటే శరీరంలో పీచు పదార్థం పెరిగి టాక్సిన్స్ ను సులభంగా బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల శరీరంలోని చెడు పదార్థాలు, టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.

చక్కెర స్థాయులు

ఖాళీ కడుపుతో ఉండి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.

బరువు తగ్గడం

బొప్పాయిని అల్పాహారంలో లేదా స్నాక్స్ సమయంలో ఖాళీ కడుపుతో తింటే కడుపు నిండి ఆకలి తీరుతుంది. దీంట్లో కేలరీలు తక్కువుంటాయి. కానీ ఎక్కువ సేపు కడుపు నిండినట్లే ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

శక్తి

బొప్పాయిలో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. దీనివల్ల శరీరానికి తగినంత శక్తి లభించి మీరు చురుకుగా ఉంటారు.

చర్మం అందం

విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి బొప్పాయి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో తినడం ద్వారా, శరీరం చర్మానికి అవసరమైన పోషకాలను కూడా గ్రహిస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యవ్వనంగా, బిగుతుగా ఉంచుతుంది.

తదుపరి వ్యాసం