ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 18, 2024

Hindustan Times
Telugu

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తినడం చాలా ముఖ్యం. జీర్ణం సరిగా అవడం, బరువు తగ్గేందుకు సహకరించడం సహా ఫైబర్ చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి. 

Photo: Pexels

జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యాలను ఆహారం తీసుకోండి. వీటిలో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు నియంత్రించడం, కడుపు ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. 

Photo: Pexels

సాధారణ బియ్యం నుంచి బ్రౌన్ రైస్‍కు మారండి. బ్రౌన్ రైస్‍లో డయెటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. బ్రౌన్ రైస్ వల్ల ఫైబర్ ఎక్కువగా తీసుకోవచ్చు. 

Photo: Pexels

ఆయా సీజన్లలో దొరికే పండ్లను ఎక్కువగా తినండి. పండ్లలో పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన ఫైబర్ అధికంగా ఉంటుంది. 

Photo: Pexels

బాదం, పిస్తా పప్పులు, చియా, నువ్వులు, చియా, ఫ్లాక్స్ విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ డైట్‍లో తీసుకుంటే ఫైబర్ ఇన్‍టేక్ పెరుగుతుంది. ఇవి కొలెస్ట్రాల్‍ను తగ్గించడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెళ్లను నియంత్రించగలవు. 

Photo: Pexels

ఫైబర్ అధికంగా ఉండే బ్రోకలీ, క్యారెట్, బీట్‍రూట్, చిలకడదుంప, క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి ఫైబర్ ఎక్కువగా అందుతుంది. 

Photo: Pexels

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels