Hot Water Side Effects : వేడి నీరు ఎక్కువగా తాగుతున్నారా? అస్సలు మంచిది కాదు
21 January 2024, 17:10 IST
- Hot Water Side Effects : వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అతిగా తాగడం మాత్రం సరైనది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వేడి నీటితో కలిగే సమస్యలు
చలికాలంలో చాలా మంది వేడి నీటిని తాగడానికి ఇష్టపడతారు. వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మితంగా తీసుకుంటే ఏం కాదు. కొందరు బాగా వేడి చేసి తాగుతారు. రోజంతా కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. వేడినీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చూద్దాం..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది వేడి నీటిని తాగమని సలహా ఇస్తారు. గొంతు నొప్పి, అజీర్ణం, అనేక ఇతర చికిత్సలకు వేడి నీటిని తాగడం సరైన పద్ధతే. చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడి నీటిని తాగడానికి ఇష్టపడతారు. వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ దాని వల్ల దుష్ప్రభావాలు కూడా వస్తాయి. వేడినీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా ఏంటో తెలుసుకుందాం..
మీరు ఎక్కువగా వేడి నీటిని తాగితే, అది ఖనిజ అసమతుల్యతను కలిగిస్తుంది. ఎందుకంటే చాలా వేడి నీటిని తాగడం వల్ల చెమట పట్టడం జరుగుతుంది. ఇది శరీరంలో ద్రవం లోపం, ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. దీనితో ఆరోగ్య సమస్యలు మెుదలవుతాయి.
హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అయితే వేడినీరును అధికంగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. వేడి నీటిని తాగడం వల్ల ఎక్కువ చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఎక్కువగా వేడి నీటిని తాగడం మానుకోండి.
రోజులో చాలాసార్లు వేడి నీళ్లు తాగడం కూడా పొట్టకు మంచిది కాదు. కడుపులో చికాకు కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో కడుపు చికాకు కూడా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలను నివారించడానికి చాలా వేడి నీటిని తాగవద్దు.
వేడి నీటిని తాగడం వల్ల దంతాల ఎనామిల్ నాశనం అవుతుంది. ఇది దంతాల మీద చెడు ప్రభావం చూపిస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల దంతాల సున్నితత్వం పెరుగుతుంది. ఇది కావిటీస్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు, జీర్ణవ్యవస్థకు చికాకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వేడి నీటిని తాగడం మానుకోవాలి. వేడి నీళ్లకు బదులు సాధారణ ఉష్ణోగ్రత నీటిని తాగితే మంచిది.
అయితే వేడి నీటిని ఉదయంపూట ఖాళీ కడుపుతో తాగండి. జీర్ణక్రియకు మంచి జరుగుతుంది. గోరువెచ్చని నీటిని తాగితే ఫలితం ఉంటుంది. కడుపు నొప్పి, అజిర్తీలాంటి సమస్యలు దూరమవుతాయి. ఉదర సంబంధిత వ్యాధులతో బాధ పడేవారికి ఉపశమనం దొరుకుతుంది.
వేడి నీటితో శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా అవుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా ఉండటానికి వేడి నీళ్లు తాగాలి. వేడి నీరు గొంతు సమస్యలను రానివ్వదు. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉండొచ్చు. దగ్గు, పడిశంతో బాధపడేవారికి వేడి నీరు ఉపశమనం కలిగిస్తాయి.
టాపిక్