తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Upma: ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

Idli Upma: ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

15 March 2024, 6:00 IST

google News
    • Idli Upma: ఇడ్లీలు వండినప్పుడు ఎన్నో కొన్ని మిగిలిపోతాయి, అలాంటప్పుడు ఉప్మా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో చేసే ఉప్మాను అయిదు నిమిషాల్లో వండేయచ్చు.
ఇడ్లీ ఉప్మా రెసిపీ
ఇడ్లీ ఉప్మా రెసిపీ

ఇడ్లీ ఉప్మా రెసిపీ

Idli Upma: ఇడ్లీ సెపరేట్‌గా, ఉప్మా సెపరేట్‌గా తిని ఉంటారు. కానీ ఇడ్లీలతో చేసిన ఉప్మాను తిని చూడండి. రుచి అదిరిపోతుంది. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా లంచ్ కోసం ఉప్మా చేసేసుకుంటే సరిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. ఇడ్లీ ఉప్మా టేస్ట్ కూడా చాలా బావుంటుంది.

ఇడ్లీ ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు

ఇడ్లీలు - 5

ఉల్లిపాయ - ఒకటి

ఎండుమిర్చి- ఐదు

కరివేపాకులు - గుప్పెడు

నూనె - రెండు స్పూన్లు

శెనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఇడ్లీ ఉప్మా రెసిపీ

1. మిగిలిపోయిన ఇడ్లీలను చేతితోనే నలిపి పొడిలాగా చేయండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

3. నూనె వేడెక్కాక ఆవాలు వేస్తే అవి చిటపటలాడుతాయి.

4. తర్వాత శెనగపప్పు వేసి వేయించండి.

5. ఆ తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి వేయించుకోండి.

6. ఇవన్నీ బాగా వేగాక రుచికి సరిపడా ఉప్పును వేయండి.

7. ఉప్పును తక్కువగా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది.

8. కాబట్టి అవసరమైతేనే ఉప్పు వేయండి. లేకపోతే ఇడ్లీలో ఉన్న ఉప్పే సరిపోతుంది.

9. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. అంతే టేస్టీ టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ అయినట్టే.

10. ఇది పొడిపొడిగా భలే రుచిగా ఉంటుంది. మీకు పొడిపొడి ఉప్మా నచ్చకపోతే కాస్త నీరు వేసుకుంటే ఉప్మా లాగా మెత్తగా వస్తుంది.

11. అయితే ఇది వండినప్పుడు పూర్తిగా చిన్న మంట మీదే ఉంచడం ముఖ్యం.

12. లేకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది.

కొన్నిసార్లు బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెండూ వండడం కష్టంగా మారుతుంది. తక్కువ సమయం ఉన్నప్పుడు ఇడ్లీలను అదనంగా పెట్టుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఇడ్లీలను, మధ్యాహ్నానికి ఇలాంటి ఉప్మాను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా, బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది.

ఇడ్లీ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కనుక రోజులో రెండుసార్లు తిన్నా కూడా మంచిదే. ముఖ్యంగా పిల్లలకు దీన్ని తినిపించడం వల్ల రోజంతా వారు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. పెద్దవాళ్లు ఈ ఇడ్లీ ఉప్మా తింటే మంచిదే. బరువు పెరగకుండా ఉంటారు. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి ఇతర ఆహారాలు తినరు.

సాధారణ ఉప్మా తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఇడ్లీ ఉప్మాను ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది.

తదుపరి వ్యాసం