Karam podi: ఇడ్లీ, దోశల్లోకి ఇలా దోసకాయ గింజల కారం పొడి చేయండి, రుచిగా ఉంటుంది
Karam podi: కారం పొడులు ఎన్నో రకాలు. నువ్వుల కారం, కొబ్బరి కారం, వేరుశెనగ కారం, వెల్లుల్లి కారం... ఇలా ఎన్నో చేసుకుంటాం. అలాగే దోసకాయ కారం కూడా చేయవచ్చు.
Karam podi: ఇడ్లీ, దోశెల్లోకి చట్నీతో పాటు పక్కన ఏదో ఒక కారం పొడి ఉంటే... ఆ రుచే వేరు. అలాగే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుంటే రుచి అదిరిపోతుంది. కొబ్బరి కారం, వెల్లుల్లి కారం, పల్లీల కారం ఎంత రుచిగా ఉంటాయో. దోశ గింజలతో చేసే కారప్పొడి కూడా అంతే రుచిగా ఉంటుంది. దోసకాయ గింజలు మార్కెట్లో లభిస్తాయి. వాటిని తెచ్చుకొని ఒకసారి కారంపొడి ట్రై చేయండి. ఇడ్లీతో దోశతో దీన్ని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
దోసకాయ గింజల కారం పొడి రెసిపీ
దోసకాయ గింజలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - పది
కరివేపాకులు - గుప్పెడు
శెనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
పల్లీలు - రెండు స్పూన్లు
మెంతులు - అర స్పూను
ఆవాలు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - పది
దోసకాయ గింజల కారం రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి దోసకాయ గింజలను చిన్న మంట మీద వేయించుకోవాలి.
2. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, మెంతులు కూడా వేసి వేయించుకోవాలి.
4. వాటిని తీసి మిక్సీజార్ లో వేసుకోవాలి.
5. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
6. వీటిని కూడా మిక్సీలో వేయాలి.
7. మిక్సీలో దోస గింజలను కూడా వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి.
8. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మళ్లీ పొడి చేయాలి.
9. అంతే దోసకాయ గింజల కారం రెడీ అయినట్టే.
10. దీన్ని గాలి చొరబడిన డబ్బాల్లో వేసుకుంటే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది.
11. ఇడ్లీలు, దోశెల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
12. ఎప్పుడు చేసే కారాల కన్నా ఈ కారం టేస్ట్ అదిరిపోతుంది. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
దోసకాయ గింజలు మనకి మేలే చేస్తాయి. దోసకాయ గింజలు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దోసకాయ గింజలు కొనడం ఇష్టం లేనివారు, దోసకాయను వండినప్పుడల్లా ఆ గింజలను తీసి దాచుకుంటూ ఉండండి. వాటిని ఎండబెడితే డబ్బాల్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అలా ఒక కప్పు దోస గింజలు అయ్యాక, ఇలా కారం పొడి చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. దోసకాయ గింజలు ధర కూడా బయట మార్కెట్లలో తక్కువగానే ఉంటుంది. దోసకాయ గింజల కారంపొడి వేడి ఇడ్లీపై వేసి, కాస్త నెయ్యి పోసుకొని తిని చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు.
టాపిక్