Mango Leaves Hair Pack : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. మామిడి ఆకులతో హెయిర్ ప్యాక్
07 November 2023, 9:33 IST
- Mango Leaves Hair Pack : మామిడి ఆకులతో హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు దీనిని ఉపయోగించుకోవచ్చు.
మామిడి ఆకులు
తెల్ల జుట్టు(White Hair) అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. వెంట్రుకలు నెరిసిపోవడం అనేది వృద్ధాప్యంలో జరిగే సహజ ప్రక్రియ. కానీ చిన్న వయసులోనే నెరిసిపోవడం మామూలు విషయం కాదు. ఇది వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. జుట్టు నల్లగా మారడానికి హెయిర్ కలర్(Hair Colours) అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మరింత చెడిపోతుంది. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే కెమికల్ ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వాడకూడదు.
ప్రత్యామ్నాయంగా, మీరు ఇంట్లోనే సహజమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు. స్టోర్లలో లభించే కెమికల్ హెయిర్ డై కంటే ఇది చాలా మంచిది. అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులతో మీ జుట్టు నల్లగా మారితే మంచిదే కదా. నేచురల్ హెయిర్ కలర్ కోసం హోం రెమెడీస్ లో ముందుగా మీకు మామిడి ఆకులు కావాలి.
మామిడి ఆకుల్లో జుట్టుకు నలుపు రంగును ఇచ్చే అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం ఉండటంతోపాటు జుట్టు ఆరోగ్యాన్ని(Hair Health) మెరుగుపరుస్తుంది. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. అయితే, మామిడి యొక్క ప్రయోజనాలు, జుట్టు కోసం ఈ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ముందుగా కొన్ని మామిడి ఆకులను(Mango Leaves) తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని మీ జుట్టు మీద సుమారు గంటన్నర పాటు అలాగే ఉంచండి. మామిడి ఆకులతో తయారుచేసే ఈ హెయిర్ ప్యాక్ క్రమంగా తెల్ల జుట్టును నల్లగా చేసి జుట్టు(White Hair To Black Hair) ఒత్తుగా పెరిగేందుకు సాయపడుతుంది.
మామిడి ఆకులను వెంట్రుకలకు అప్లై(Mango Leaves For Hairs) చేసే మరో మార్గం ఏంటంటే.. మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించడం. నీళ్ల రంగు మారినప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఈ నీళ్లను జుట్టు చివర్ల నుంచి పట్టించాలి. ఈ నీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
మూడోది మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి బ్లాక్ టీ (చక్కెర కలపకుండా టీ) వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. మీకు కావాలంటే ఈ పేస్ట్‌లో హెన్నాను కూడా జోడించవచ్చు. ఈ విధంగా మీరు మరింత మెరుగైన ఫలితాలను చూస్తారు.
మంచి ఫలితాలను చూడటానికి కొన్నివారాల పాటు ఇలా రిపీట్ చేయండి. మామిడి ఆకులు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. జుట్టును సరిగా ఉంచేందుకు కొన్ని విషయాలు పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడి లేని జీవనశైలిని గడపాలి. రసాయనాలు లేని షాంపూ ఉపయోగించాలి. వేడి-స్టైలింగ్ సాధనాలను నివారించాలి. హైడ్రేటెడ్‌గా ఉండటం వంటివి మీ జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.