తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall Reduce Tips : జుట్టు సమస్యలు ఉన్నాయా? ఇలా మందార ఉపయోగించండి

Hair Fall Reduce Tips : జుట్టు సమస్యలు ఉన్నాయా? ఇలా మందార ఉపయోగించండి

Anand Sai HT Telugu

11 May 2023, 14:54 IST

google News
    • Hair Fall Reduce Tips : జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలల్లో సాధారణ సమస్య. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి.. సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలడానికి గల కారణాలను ముందుగా గుర్తించాలి. దాని ఆధారంగా మీరు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మందార
మందార

మందార

తరచుగా ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, కొన్ని మందులు మీ జుట్టు ఆరోగ్యాన్ని(Hair Health ప్రభావితం చేస్తాయి. కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు కూడా మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీకు జుట్టు రాలడంతోపాటు వివిధ రకాల జుట్టు సమస్యలు(Hair Problems) ఉంటే, మీరు సహజ పరిష్కారాల వైపు వెళ్లాలి. ఇంట్లోనే చిట్కాలు చేసుకోవచ్చు. మందార చెట్టు మీ ఇంటి దగ్గర ఉంటే.. దానిని ఉపయోగించొచ్చు.

మందార(hibiscus) పురాతన కాలం నుండి జుట్టు రాలకుండా ఉపయోగిస్తుంటారు. వాటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవి జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తాయి, స్కాల్ప్ యొక్క pHని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. మందార టీ కూడా మీ జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు రాలడం(Hair Loss), పొడి జుట్టు(Dry Hair) ఉంటే మందారను ఉపయోగించే మార్గాల గురించి మీరు తెలుసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, మెరిసే జుట్టును పొందడంలో సహాయపడుతుంది.

మీరు చేయాల్సిందల్లా ఒక టేబుల్ స్పూన్ మందార పొడిని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లాగా తయారుచేయండి. ఈ పేస్ట్‌ను 15-20 నిమిషాల తర్వాత మీ తలకు, జుట్టు(Hair)కు అప్లై చేసి కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మీ జుట్టు నిగనిగలాడుతుంది. మందార పొడి లేకపోతే మందార పువ్వు, ఆకులను మెత్తగా రుబ్బుకుని ఆ పేస్ట్‌ని తలకు పట్టించవచ్చు.

మందార పొడి, కొబ్బరి నూనె(Coconut Oil) సమాన భాగాలుగా కలపడం ద్వారా ఇంట్లో మందార నూనె సిద్ధం చేయవచ్చు. ఈ నూనెను మీ తలపై 10 నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌కు పోషణ అందుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మీ రెగ్యులర్ కండీషనర్‌లో ఒక టేబుల్ స్పూన్ మందార పొడిని జోడించండి. ఇది మీ జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని(Hair Loss) తగ్గించడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మందార ఆకు, పువ్వును ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇంట్లోనే ఈ నేచురల్ రెమెడీని ప్రయత్నించండి, మెరిసే జుట్టును పొందండి.

తదుపరి వ్యాసం