తెలుగు న్యూస్ / ఫోటో /
Benefits of Hibiscus Tea : మందారటీని డైలీ తీసుకుంటే.. బహు ప్రయోజనాలు పొందవచ్చు..
Benefits of Hibiscus Tea : ఈ టీలో కెఫిన్ ఉండదు. ఫలితంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వాపు, రక్తపోటు సమస్యలు, బరువు సమస్యల వరకు చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. ఉదయం మీరు తీసుకునే టీలో ఈ పువ్వు చేర్చితే మీకు కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.
Benefits of Hibiscus Tea : ఈ టీలో కెఫిన్ ఉండదు. ఫలితంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వాపు, రక్తపోటు సమస్యలు, బరువు సమస్యల వరకు చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. ఉదయం మీరు తీసుకునే టీలో ఈ పువ్వు చేర్చితే మీకు కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.
(1 / 8)
అనేక వ్యాధులను ఇంటి నివారణలతో నయం చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కానీ వ్యాధి విపరీతమైతే వైద్యుడే దిక్కు. అయినా ఇంట్లో కొన్ని ఆయుర్వేదం చిట్కాలను ఫాలో అవ్వొచ్చు అంటున్నారు. అయితే మీ డైట్లో మందార పువ్వు తీసుకోవాలంటున్నారు. ఇవి శరీరంలోని వివిధ రుగ్మతలను ఎలా నయం చేస్తుందని డైటీషియన్ బెత్ గెరోనీ తెలిపారు.
(2 / 8)
మందార పువ్వు టీ రంగు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ టీలో కెఫిన్ ఉండదు. ఫలితంగా శరీరంలో వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.
(3 / 8)
ప్రత్యేక పద్ధతిలో మందార పువ్వును ఎండబెట్టి టీ తయారు చేసుకుని తాగితే.. గుండె సమస్యలు దూరం చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే అల్జీమర్స్, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ టీతో ఉపశమనం లభిస్తుంది అంటున్నారు.
(4 / 8)
రక్తపోటును తగ్గించడంలో ఈ టీ చాలా మేలు చేస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ చెప్పింది. అలాగే ఈ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.(Unsplash)
(5 / 8)
బరువు తగ్గించడంలో మందార పువ్వు ప్రాముఖ్యత అపారమైనదని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం సమస్య నుంచి దూరంగా ఉంచడానికి మందార పువ్వు రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు సంరక్షణలో కూడా గొప్పగా పనిచేస్తుంది.
(6 / 8)
మందార పువ్వు టీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ టీ శరీరంలోని వివిధ రకాల టాక్సిన్స్‌ను తొలగించి.. వివిధ ప్రయోజనాలను అందిస్తుంది.
(7 / 8)
మందార పువ్వు టీని ఎలా తయారు చేసుకోవాలో తెలియదని బాధపడకండి. ఇక్కడ రెసిపీ ఉంది చూసి నేర్చుకోండి. ఈ టీ కోసం 3 నుంచి 4 మందార పువ్వులు అవసరం అవుతాయి. ఈ పువ్వులను బాగా కడిగి ఆరబెట్టాలి. ఎండినవి రెడీగా ఉంటే… పాత్రలో నీటిని వేడి చేసి.. దానిలో ఎండిన మందార పువ్వులను వేయాలి. అది మరిగిన తర్వాత వడకట్టాలి. దానిలో నిమ్మరసం పిండి.. రుచికోసం తేనే వేసుకుని తీసుకోవచ్చు. (ఈ పానీయం తీసుకునే ముందు వివరణాత్మక ఆరోగ్య సమాచారం కోసం వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించండి.)
ఇతర గ్యాలరీలు