తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness Secrets : కృతి సనన్‌లా ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి

Fitness Secrets : కృతి సనన్‌లా ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి

Anand Sai HT Telugu

03 February 2024, 5:30 IST

google News
    • Kriti Sanon Fitness Secrets : నటి కృతి సనన్ చూసేందుకు చాలా ఫిట్‌గా ఉంటుంది. ఆమె తన శరీరాన్ని కాపాడుకునేందుకు మంచి చిట్కాలు పాటిస్తూ ఉంటుంది. అవేంటో మీరు తెలుసుకోండి.
కృతి సనన్ ఫిట్‌నెస్
కృతి సనన్ ఫిట్‌నెస్

కృతి సనన్ ఫిట్‌నెస్

బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటి కృతి సనన్. ఒకదాని తర్వాత ఒకటి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆదిపురుష్ సినిమాలో మెరిసింది. ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం మర్చిపోవద్దు అనేది ఆమె సూత్రం. ఆ మేరకు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ ఉంటుంది.

కృతి సనన్ తరచుగా తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. వాటితో ఆమె అభిమానులను ఉత్తేజపరుస్తుంది. కృతి ఫోటో పోస్ట్ చేసిన వెంటనే దానికి లైక్స్, కామెంట్స్ వస్తాయి. నటి కృతి సనన్ రోజువారీ వర్క్ అవుట్ రొటీన్‌లను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

నటి కృతి సనన్ వ్యాయామశాలకు వెళ్లడమే కాకుండా యోగా, డ్యాన్స్ కూడా చేస్తుంది. ఇది మీ వర్క్ అవుట్ రొటీన్‌లో కొన్ని మార్పులు చేయడం లాంటిది ఎందుకంటే మీరు ప్రతిరోజూ ఒకే రకమైన వర్క్ అవుట్ చేస్తే అది బోరింగ్ అవుతుంది. ఇలా చాలా రకాల వర్కౌట్స్ చేస్తే కొత్తగా ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయాలి అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటి కృతి సనన్ ప్రకారం, నడక ఉత్తమమైన వ్యాయామాలలో ఒకటి. ప్రయాణంలో వర్కవుట్ చేయడానికి సమయం లేకపోతే వీలైనంత వరకు నడుచుకుంటూ ఉంటారు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా వీలైనంత ఎక్కువగా నడుస్తారు. దీని అర్థం మనం చాలా కేలరీలను బర్న్ చేయగలం. అన్నింటికంటే నడక ఉత్తమమైన వ్యాయామం. అందుకే నడవడం ప్రతి ఒక్కరు చేయాలి. ఈరోజుల్లో ఆఫీసుల్లో వర్క్ చేసేవారు నడక అనేది మరిచిపోతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు అవసరం. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలి. కృతి సనన్ కూడా అంతే తగినంత నీరు తాగుతారు. కూరగాయలు, పండ్ల రసాలను తాగుతారు. బచ్చలికూర, దోసకాయ, పొట్లకాయ, ఉసిరి, నిమ్మ, పుదీనా, గ్రీన్ యాపిల్ జ్యూస్‌ని ఒకదాని తర్వాత మరొకటి తగినంత పరిమాణంలో రోజూ తాగాలి.

కృతి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఏ కారణం చేత కూడా జంక్ ఫుడ్ తినకూడదు. చాలా తాజా పండ్లు, సలాడ్లు తినాలి. మెరిసే చర్మం రహస్యం ఈ తాజా పండ్లు, కూరగాయలే. మీరు కూడా కృతి సనన్‌లాగా ఫిట్ నెస్‌గా ఉండాలంటే పైన చెప్పినవి ఫాలో అయిపోండి. మీరు కూడా ఆమెలాగా అందంగా తయారవుతారు.

తదుపరి వ్యాసం