తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muscle Strong Tips : జిమ్ వెళ్లకుండా కండలు పెంచుకోవడం ఎలా?

Muscle Strong Tips : జిమ్ వెళ్లకుండా కండలు పెంచుకోవడం ఎలా?

Anand Sai HT Telugu

10 February 2024, 5:30 IST

    • Muscle Strong Tips : కండలు బలంగా తయారు కావాలంటే జిమ్‌కి వెళ్లాల్సిందేనని అందరూ చెబుతారు. అయితే జిమ్‌కి వెళ్లకుండానే శరీరాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడ సాధారణ వ్యాయామాలు ఉన్నాయి.
ఇంట్లో చేసే వ్యాయామాలు
ఇంట్లో చేసే వ్యాయామాలు (Unsplash)

ఇంట్లో చేసే వ్యాయామాలు

ప్రస్తుతం కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ మంచి ఫిట్ నెస్ ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ జిమ్‌కి వెళ్లడానికి సమయాన్ని ఇవ్వలేరు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేరు. ఇంట్లోనే కొన్ని వ్యాయమాలు చేసి.. మీ బాడీని స్ట్రాంగ్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి వ్యాయామ పరికరాలు లేకుండా కూడా మీరు శరీరాన్ని బలంగా తయారు చేసుకోవచ్చు. అందుకో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

ట్రెడ్‌మిల్ కొనడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి మీ కాళ్ళు సరిపోతాయి. మీరు మీ కార్డియోపై ఎక్కువ దృష్టి పెడితే మీ శరీరంలో మార్పును మీరు అనుభవిస్తారు. రన్నర్‌లు లేదా సైక్లిస్టులు ఎప్పుడూ వ్యాయామం చేయరు. ఎందుకంటే వారు కార్డియోపై ఎక్కువ దృష్టి పెడతారు. చాలా మంది స్విమ్మర్లు, రన్నర్లు జిమ్‌లో సమయాన్ని వెచ్చించరు. వారి శరీరాకృతి చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. దానికి కారణం వారి సమతుల్య ఆహారం, వారి పరుగు. కార్జియో వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయండి. ప్రతి వారం 5 నిమిషాలు పెంచండి.

మీ కండరాలను బలోపేతం చేయడానికి మరో వ్యాయామం. ఇది చూసేందుకు తేలికగా అనిపించినప్పటికీ చేస్తుంటే కష్టంగా ఉంటుంది. దీన్ని చేయడానికి మీ చేతులను నేరుగా మీ భుజాల వైపునకు చాచాలి. ఆపై గోడ కుర్చీ వేసినట్టుగా మోకాళ్ల వరకూ కూర్చోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ ఛాతీ, వీపు నిటారుగా ఉంచండి. మోకాళ్ల వరకూ వంగినప్పుడు మీ బరువు అంతా మీ పాదాలపై ఉండాలి.

పుష్ అప్స్ మీ ఛాతీ, భుజం కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన వ్యాయామం. భుజం వెడల్పునకు దూరంగా నేలపై మీ చేతులను ఉంచండి. మీ ఛాతీ దాదాపు నేలను తాకేలా ఉండాలి. పడుకున్న స్థానంలో ఉండాలి. మీ కాలి వేళ్లపై ఉండాలి. మీ శరీరాన్ని కిందకు పైకి అంటు ఉండాలి. నేలపై పుష్-అప్‌లు చేయడం ప్రయోజనకరం. మీ ఛాతీ, మీ చేతి కండరాలు బలంగా తయారవుతాయి.

బెండింగ్ మంచి వ్యాయామం. సిక్స్ ప్యాక్ కావాలనుకునే వారు దీన్ని తప్పక చేయండి. ఇది శరీరంలోని ఇతర భాగాల కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. నేలపై లేదా కార్పెట్‌పై పడుకుని మీ మోకాళ్లను పైకి లేపాలి. మీ చేతులను తల వెనక్కు పెట్టాలి. ఆ తర్వాత మీ శరీరాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. మీ చేతులను ఉపయోగించకుండా.. వెనుక కండరాలను మాత్రమే ఉపయోగించి మీ శరీరాన్ని పైకి లేపాలి. వెనక్కు వెళ్లేప్పుడు మెల్లగా వెళ్లాలి. ఈ వ్యాయామం ప్రారంభించినప్పుడు పది నుండి పదమూడు సార్లు చేయండి. తర్వాత నెమ్మదిగా సంఖ్యను పెంచండి.

తొడ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం ఉంది. ఏదైనా బల్ల దగ్గరకు వెళ్లాలి. మీరు ముందుకు నిల్చోని.. చేతులు వెనక్కు బల్ల మీద పెట్టాలి. తర్వాత కిందకు, పైకి లేస్తూ ఉండాలి. మీరు అలసిపోయే వరకు ఇలా చేయండి. ఇలా రోజుకు 30 సార్లు చేస్తే మంచిది. మీ శరీరం బలంగా తయారవుతుంది.

ఈ వ్యాయమాలతోపాటుగా మంచి ఆహారం తీసుకోవాలి. మనం ఎన్ని వ్యాయామాలు చేసిన తీసుకునే ఆహారం మీద మన శరీర ఆకృతి ఆధారపడి ఉంటుంది. వ్యాయామలతోపాటుగా శరీరాన్ని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోండి. పైన చెప్పిన వ్యాయామాలు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

తదుపరి వ్యాసం