Delhi crime news : మోమో తింటుంటే.. భుజం తగిలిందని బాలుడిని పొడిచి చంపిన మైనర్​!-in delhi teen stabs another to death argument started while eating momos ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Crime News : మోమో తింటుంటే.. భుజం తగిలిందని బాలుడిని పొడిచి చంపిన మైనర్​!

Delhi crime news : మోమో తింటుంటే.. భుజం తగిలిందని బాలుడిని పొడిచి చంపిన మైనర్​!

Sharath Chitturi HT Telugu
Dec 23, 2023 07:20 AM IST

Delhi crime news : మోమో తింటుంటే భుజం తగిలిందన్న కారణంతో.. ఓ మైనర్​ని, మరో మైనర్​ చంపేశాడు! దిల్లీలో జరిగింది ఈ ఘటన.

మోమో తింటుంటే భుజం తగిలిందని మైనర్​ని పొడిచి చంపి..!
మోమో తింటుంటే భుజం తగిలిందని మైనర్​ని పొడిచి చంపి..!

Delhi crime news : దిల్లీలో దారుణ ఘటన జరిగింది! ఓ 17ఏళ్ల బాలుడిని మరో మైనర్​ చంపేశాడు. మోమోలు తింటుండగా మొదలైన గొడవ ఇందుకు కారణం.

ఇదీ జరిగింది..

దిల్లీ ద్వారకాలోని డాబ్రి ప్రాంతంలోని రోహ్​తాష్​ నగర్​లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్​.. సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ మోమో తింటుండగా.. 17ఏళ్ల మైనర్​.. అతని భుజానికి తగిలింది. అంతే! కోపంతో గొడవ పెట్టుకున్నాడు మరో మైనర్​.

Teen stabbed to death : గొడవ పెద్దదైంది. మోమో తింటున్న మైనర్​కి కోపం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. కత్తితో 17ఏళ్ల బాలుడిని పొడిచి, పొడిచి చంపేశాడు! అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్ర గాయాలతో పడి ఉన్న 17ఏళ్ల మైనర్​ని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగింది? అన్న విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

Teen stabbed to death in Delhi : "మోమో తింటుండగా.. ఓ మైనర్​ భుజం, నిందితుడి భుజానికి తగిలింది. గొడవ జరిగింది. 17ఏళ్ల మైనర్​ని ఆ వ్యక్తి చంపేశాడు. అతను కూడా మైనరే! ఈ విషయాన్ని బాధితుడి స్నేహితులు, ఘటనాస్థాలంలో ఉన్న వారు చెప్పారు," అని పోలీసులు వెల్లడించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆ మైనర్​ దారుణంగా పొడి చంపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కినట్టు తెలిపారు. వాటి ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.

పూజారి దారుణ హత్య..

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పూజారి దారుణ హత్యకు గురైన ఘటన.. బిహార్​లో ఇటీవలే కలకలం సృష్టించింది.

Priest murdered in Bihar : గోపాల్​గంజ్​ జిల్లాలోని దానాపూర్​ గ్రామంలో నివాసముండే 32ఏళ్ల మనోజ్​ కుమార్​.. స్థానికంగా ఉండే శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు.. బీజేపీలో కార్యకర్తగా ఉండేవాడు.

కాగా.. 32ఏళ్ల మనోజ్​.. గత సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. శనివారం అర్థరాత్రి సమయంలో మనోజ్​ మృతదేహం కనిపించింది. అతడిని ఎవరో అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులు చూసేసరికి, అతని కళ్లు బయటకు వచ్చి పడి ఉన్నాయి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం