Soya Biryani Recipe : సోయా బిర్యానీ.. కొత్త రకం టేస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి
25 February 2024, 11:00 IST
- Soyabean Biryani Recipe : బిర్యానీ అంటే చాలా ఫేమస్. అయితే ఇందులో రకరకాలు చేసుకోవచ్చు. కొత్తగా సోయాబీన్ బిర్యానీ చేసుకోండి. కొత్తగా ఉంటుంది.
సోయా బిర్యానీ
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం బిర్యానీ. ఇండియన్ బిర్యానీ విదేశాల్లో చాలా ఫేమస్. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిర్యానీలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. వెజ్ బిర్యానీలో అనేక రకాలు ఉన్నాయి. అందులో సోయాబీన్ బిర్యానీ ఒకటి.
శాఖాహారులకు అత్యంత రుచికరమైన బిర్యానీలలో సోయా బిర్యానీ ఒకటి. మష్రూమ్ బిర్యాబీ కాకుండా సోయా బిర్యానీ తినడం చాలా మందికి ఇష్టం. అయితే ఈ సోయా బిర్యానీని ఎలా తయారు చేయాలి? పదార్థాలు ఏంటి?
సోయాబీన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :
సోయా - 2 కప్పులు, పెరుగు - 1/4 కప్పు, కారం పొడి - 1 టేబుల్ స్పూన్, గరం మసాలా - 1 tsp, ఉప్పు - అవసరమైనంత, బాస్మతి బియ్యం - 2 కప్పులు, పెద్ద ఉల్లిపాయ - 2, టొమాటో - 2, పసుపు పొడి - 1/4 tsp, కారం పొడి - 1 టేబుల్ స్పూన్, గరం మసాలా - 1 tsp, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - 2, దాల్చిన చెక్క - 1, యాలకులు - 2, లవంగాలు - 2, పుదీనా ఆకులు - కొన్ని, పిడికెడు కొత్తిమీర,నీరు - 3 కప్పులు,
మసాలా తయారీకి కావలసిన పదార్థాలు : అల్లం - 1, వెల్లుల్లి - 4, లవంగాలు కొన్ని, పచ్చిమిర్చి - 2, దాల్చిన చెక్క - 1 యాలకులు - 2
సోయాబీన్ బిర్యానీ తయారీ విధానం
మెుదట బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత సోయాబీన్స్ వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి.. ఆ నీటిని వడకట్టాలి.
తర్వాత మిక్సీ జార్‌లో లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో సగం మసాలా, కారం, పెరుగు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి 20 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి అందులో 2 చెంచాల నెయ్యి, నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకులు, మెంతులు, లవంగాలు, యాలకులు వేసి కలపాలి.
ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి, మిగిలిన మసాలా దినుసులు, కొన్ని పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత టొమాటో ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
టొమాటో బాగా ఉడికిన తర్వాత సోయా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత 2 కప్పుల బాస్మతి రైస్‌తో పాటు కొన్ని పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో 1 చెంచా నెయ్యి, 3 కప్పుల నీళ్లు పోసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.
మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, ప్రెషర్ కుక్కర్‌ని తెరవండి. రుచికరమైన సోయా బిర్యానీ రుచికి సిద్ధంగా ఉంటుంది.