తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Perfect French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేయండి.. మాల్స్, థియేటర్స్ లాంటి వాటి రుచి వస్తుంది

Perfect French fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేయండి.. మాల్స్, థియేటర్స్ లాంటి వాటి రుచి వస్తుంది

10 September 2024, 15:30 IST

google News
  • Perfect French fries: రెస్టారెంట్ స్టైల్ రుచిలో ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కొన్ని సీక్రెట్స్ తెల్సుకుంటే బయట క్రిస్పీగా లోపల క్రీమీగా రుచిగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైలు చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ
ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ (pinterest)

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ

బయట మాల్స్, థియేటర్లు, పెద్ద షాపుల్లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా మందికి ఇష్టమే. బర్గర్లు, శ్యాండ్‌విచ్ లాంటివి ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా వీటిని పక్కన సర్వ్ చేస్తారు. అయితే ఈ బంగాళదుంప స్నాక్ రెసిపీని ఇంట్లో ప్రయత్నిస్తే ఆ రుచి అస్సలు రాదు. దానికి కారణం సరైన టిప్స్ తెలీక పోవడమే. ముందు కొన్ని సీక్రెట్ టిప్స్ తెల్సుకుని.. ఫ్రెంచ్ ఫ్రైస్ బయట క్రిస్పీగా, లోపల క్రీమీగా ఉండేలా ఎలా చేయాలో రెసిపీలో చూద్దాం.

రెస్టారెంట్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ సీక్రెట్స్:

  1. స్టార్చ్ లేదా పిండి పదార్థం తక్కువుంటే బంగాళదుంప రకాలు దీనికి వాడాలి. అవి చూడ్డానికి పెద్దగా, వెడల్పుగా, పొడవుగా ఉంటాయి.
  2. కట్ చేసేటప్పుడు ప్రతి ముక్క సమానమైన వెడల్పు ఉండేలా చూసుకోవాలి. లేదంటే అన్నీ ఒకే రకంగా ఫ్రై అవ్వవు.
  3. కట్ చేసుకున్న ముక్కలను అరగంట సేపు ఐస్ వాటర్ లో నానబెడితే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. స్టార్చ్ పోతుంది.
  4. ఒకసారి ఫ్రై చేసి ఊరుకుంటే రుచి రాదు. తప్పకుండా రెండు సార్లు వీటిని ఫ్రై చేయాలి. మొదటిసారి ఫ్రై చేసినప్పుడు బంగాళదుంప లోపల ఉడికితే, రెండోసారి బయట క్రిస్పీగా మారి బంగారువర్ణం వస్తుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ పెద్ద బంగాళదుపంలు

4 కప్పుల చల్లని నీరు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

సగం టీస్పూన్ కారం

సగం టీస్పూన్ ఉప్పు

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం:

  1. ముందుగా బంగాళదుంపల చెక్కు తీసి 1 సె.మీ వెడల్పుతో పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి.
  2. వీటిని ఐస్ వాటర్ లో అరగంట సేపుంచి కడిగేయాలి.
  3. కడిగిన ముక్కల్ని ఒక కిచెన్ టవల్ మీద తీసుకుంటే తడి పీల్చుకుంటుంది.
  4. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
  5. ఒక అయిదు నిమిషాలు మీడియం మంట మీద ఫ్రై చేశాక ముక్కలు ఉడుకుతాయి. కానీ రంగు రాదు.
  6. వీటిని ఇలా ఉండగానే బయటకు తీసేయాలి.
  7. ఒకవేళ మీకు పొడవాటి బంగాళదుంపలు దొరికితే ఈ తరువాతి స్టెప్ అవసరం లేదు. చిన్న బంగాళదుంపలు వాడితే మాత్రం ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని కనీసం అరగంట సేపు ఫ్రీజర్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అతుక్కోకుండా వస్తాయి.
  8. తర్వాత తీసి మళ్లీ నూనెలో మరోసారి వేయించాలి. ఇప్పుడు బంగారు వర్ణంలోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు.
  9. వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని కారం పొడి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  10. వీటిని మయోనైజ్‌తో సర్వ్ చేసుకుంటే మాల్స్, రెస్టారెంట్ లాంటి రుచి వస్తుంది చూడండి.

తదుపరి వ్యాసం