Oily Skin: చర్మం ఎక్కువ జిడ్డుగా అవుతోందా? తేనెను ఈ 5 రకాలుగా వాడితే వదిలేస్తుంది
09 December 2024, 14:00 IST
- Oily Skin - Honey: కొందరి చర్మం ఎక్కువగా జిడ్డుగా అవుతుంటోంది. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో అని ఆలోచిస్తుంటారు. చర్మపు జిడ్డు తొలగేందుకు తేనె ఉపయోగపడుతుంది. తేనెను చర్మానికి ఎలా వాడాలంటే..
Oily Skin: చర్మం ఎక్కువ జిడ్డుగా అవుతోందా? తేనెను ఈ 5 రకాలుగా వాడితే వదిలేస్తుంది
చర్మంపై జిడ్డు ఎక్కువగా ఉంటే మొటిమలు, నల్లటి మచ్చలు, రంధ్రాలు లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కొందరి చర్మంపై జిడ్డు ఎక్కువగా వస్తుంటుంది. ఉండాల్సిన దాని కంటే కొన్ని రకాల ఆయిల్స్ చర్మంలో ఎక్కువగా ఉత్పత్తి అవడం ఇలా జరుగుతుంటుంది. చర్మంపై ఉన్న జిడ్డును పోగొట్టుకునేందుకు ఎలాంటి ప్రొడక్ట్ వాడాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే, సహజంగా తేనెతో చర్మానికి ఉన్న జిడ్డును వదిలించుకోవచ్చు.
తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‍ఫ్లేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఆయిలీ స్కిన్‍కు కారణమయ్యే హనికర బ్యాక్టీరియాను తేనెలోని ఎంజైమ్‍లు నాశనం చేస్తాయి. ఇందులోని యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, స్వెల్లింగ్ తగ్గిస్తాయి. చర్మంపై జిడ్డు తగ్గేందుకు తేనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడండి.
తేనె, నిమ్మరసం
- ఓ టేబుల్‍స్పూన్ తేనెలో, ఓ టేబుల్‍స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- కాటన్ ప్యాడ్స్ లేదా చేతి వేళ్లతో ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి.
- కంటికి తగలకుండా ముఖానికి పూయాలి. గుండ్రంగా రుద్దుతూ ఈ మిశ్రమాన్ని చర్మానికి మసాజ్ చేసుకోవాలి.
- ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మృధువుగా టవల్‍తో ముఖం తుడుకోవాలి.
తేనె, దాల్చినచెక్క
- టేబుల్ స్పూన్ తేనెలో, అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖంపై పట్టించాలి.
- 20 నిమిషాల్లో ఇది ఆరిపోతుంది.
- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
తేనె, ఓట్‍మీల్
- ఓ టేబుల్ స్పూన్ తేనె, పావు కప్పు ఓట్‍మీల్, ఓ టేబుల్‍స్పూన్ గోరువెచ్చటి నీటిని ఓ గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని మృధువుగా ముఖానికి పట్టించాలి.
- మసాజ్ చేసినట్టుగా దీన్ని ముఖానికి రాసుకోవాలి.
- సుమారు 15 నిమిషాల తర్వాత ఇది ఆరిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
తేనె, చెక్కెరతో స్క్రబ్
- రెండు టేబుల్ స్పూన్‍ల తేనెలో అరకప్పు సన్న చక్కెర, ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
- ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా రాయాలి.
- కొన్ని నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ చర్మంపై మసాజ్ చేయాలి.
- ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
తేనే, కలబంద జెల్
- ఓ టేబుల్‍స్పూన్ తేనెలో రెండు టేబుల్ స్పూన్‍ల కలబంద జెల్ వేసి బాగా కలపాలి.
- ఆ మిశ్రమాన్ని ముఖానికి మృధువుగా రాసుకోవాలి.
- సుమారు 20 నిమిషాల తర్వాత వరకు అలాగే ఉంచాలి. ఆరిపోయాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి.