Weight Loss Tips: నిమ్మరసంతో మీరు నమ్మలేని ప్రయోజనాలు, రోజూ తాగితే బరువు తగ్గుతారు-how lemons can help you lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Tips: నిమ్మరసంతో మీరు నమ్మలేని ప్రయోజనాలు, రోజూ తాగితే బరువు తగ్గుతారు

Weight Loss Tips: నిమ్మరసంతో మీరు నమ్మలేని ప్రయోజనాలు, రోజూ తాగితే బరువు తగ్గుతారు

Galeti Rajendra HT Telugu
Oct 10, 2024 09:03 PM IST

రోజూ నిమ్మరసం తాగితే మీ ఆరోగ్యం మరింత మెరుగు పడటంతో పాటు బరువు కూడా మీరు ఊహించని విధంగా తగ్గుతారు. నిమ్మరసంలో దాగి ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.

నిమ్మకాయలు
నిమ్మకాయలు (unsplash)

నిమ్మకాయలో మనకి తెలియని అనే ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిమ్మరసానికి ఆకలిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మెరుగుపరిచే శక్తి కూడా ఉంది. అలానే బరువు తగ్గడానికి కూడా నిమ్మ సహాయపడుతుంది.

yearly horoscope entry point

నిమ్మకాయ అనేది నేరుగా కొవ్వు తగ్గడానికి కారణం కానప్పటికీ, అవి వివిధ మార్గాల్లో బరువు తగ్గుదలకి సహాయపడుతుంది. నిమ్మ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు (కేన్సర్‌ను నివారించే పోషకాలు), ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ జీవక్రియను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం కూడా శరీరానికి పోషకాలను మరింత సమర్ధవంతంగా అందించడంలో సహాయపడుతుంది, ఇది మెరుగైన మొత్తం ఆరోగ్యానికి దారితీస్తుంది

బరువు తగ్గుదల ఎలా?

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని గ్లాసు నీళ్లతో నిమ్మ రసం తాగి రోజును ప్రారంభించడం వల్ల మీ మెటబాలిజమ్‌ను ఉదయాన్నే తారాస్థాయికి వెళుతుంది.

నిమ్మకాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఒక్కో నిమ్మకాయకు 17 కేలరీలు ఉంటాయి. నిమ్మరసం మీ భోజనాన్ని రుచిగా మార్చడానికి ఉపయోగించడం వల్ల మొత్తం మీ రోజువారీ కేలరీల శాతాన్ని తగ్గించుకోవచ్చు.

నిమ్మరసంలో సిట్రిక్‌ యాసిడ్

నిమ్మకాయలోని సిట్రిక్‌ యాసిడ్ మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవటానికి సహాయపడుతుంది, మెరుగైన జీర్ణక్రియ అంటే మీ శరీర కూర్పునకు దోహదం చేస్తుంది. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు.. మరీ ముఖ్యంగా విటమిన్ సి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయ నీరు తేలికపాటి మూత్ర విసర్జనకి బాగా పనిచేస్తుంది, ఇది శరీరం నుండి టాక్సిన్స్, అదనపు నీటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. క్లారిటీగా చెప్పాలంటే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

ఆకలి కోరిక తగ్గుదల

నిమ్మకాయలలో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలి కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. భోజనానికి ముందు నిమ్మకాయ నీరు తీసుకోవడం వల్ల మీరు కాస్త కడుపు నిండిన అనుభూతి చెందుతారు. దాంతో అతిగా తినడాన్ని తగ్గిస్తారు. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును బర్న్ చేసి మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నిమ్మకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రియాక్షన్ మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభం అవుతుంది. షుగర్, ఆకలి కోరికల పెరుగుదలను నివారిస్తుంది, ఇది మీ మెరుగైన డైట్‌కి సహాయపడుతుంది.

కొవ్వు నిల్వలు ఖాళీ

ఆమ్లంగా ఉన్నప్పటికీ నిమ్మకాయలు శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో ఆల్కలీన్ వాతావరణంలో కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. ఇది మీ బరువు తగ్గడానికి దోహద పడుతుంది.

బరువు తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ రోజువారీ ఆహారంలో నిమ్మరసం చేర్చడానికి ప్రయత్నించండి.

Whats_app_banner