తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ Upi Idని మర్చిపోయారా?.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!

మీ UPI IDని మర్చిపోయారా?.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

16 May 2022, 18:39 IST

google News
    •  పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణంగా దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పుడు డిజిటల్‌ పేమెంట్స్‌ భారత్‌‌లో శరవేగంగా జరుగుతున్నాయి
UPI ID
UPI ID

UPI ID

దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ ఊపందుకుంది. వినియోగదారులు UPI అధారంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సులువుగా నగదును బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 150 మిలియన్లకు పైగా వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు డిజిటల్ చెల్లింపులు అన్ని UPI IDని అధారంగానే జరుగుతున్నాయి. దీని వల్ల వినియోగదారులు బ్యాంక్ ఖాతా నంబర్‌లు లేదా ఇతర వివరాలను పంచుకోవాల్సిన అవసరం ఉండదు. Paytm, PhonePay,Google Pay వంటి అనేక డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ యాప్‌లను ఉపయోగించాలంటే భీమ్ UPI ని తప్పనిసరి.

డిజిటల్ చెల్లింపులలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన UPI ID.. Google Pay, Paytm లేదా PhonePayలో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PhonePayలో UPI ID

ఎక్కువ మంది వినియోగదారులు PhonePay UPI ఆధారంగానే లావాదేవీలు జరుపుతున్నారు. ఫోన్‌పేలో UPI IDని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం

ముందుగా, మీ ఫోన్‌లో PhonePay యాప్‌ని ఓపెన్ చేయండి.

ఇప్పుడు స్క్రీన్ ఎగువ ఎడమ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై నొక్కండి

UPI సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి

ఇప్పుడు మీరు మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన UPIIDని గుర్తించవచ్చు

Paytm యాప్‌లో UPI ID

ముందుగా మీ ఫోన్‌లో Paytm యాప్‌ని తెరవండి

ఇప్పుడు స్క్రీన్ ఎగువ ఎడమ మూలలో కనిపించే ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి

ఇప్పుడు మీకు QR కోడ్ ఎగువన UPI ID కనిపిస్తుంది.

GooglePayలో UPI ID

ముందుగా, స్మార్ట్‌ఫోన్‌లో GooglePay యాప్‌ని ఓపెన్ చేయండి

తర్వాత యాప్ కుడి ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై నొక్కండి

ఇప్పుడు మీ UPI IDని తెలుసుకోవడానికి బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి

'UPI ID' విభాగంలో మీ ID కనిపిస్తుంది

 

తదుపరి వ్యాసం