తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid Hair Fall : థైరాయిడ్ సమస్యతో జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకోవాలి?

Thyroid Hair Fall : థైరాయిడ్ సమస్యతో జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకోవాలి?

Anand Sai HT Telugu

19 February 2024, 17:10 IST

google News
    • Thyroid Hair Fall Reduce : చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. దీని లక్షణాల్లో ప్రధానమైనది జుట్టు రాలడం. థైరాయిడ్ కారణంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలి?
థైరాయిడ్‌తో జుట్టు రాలడం సమస్య
థైరాయిడ్‌తో జుట్టు రాలడం సమస్య (Unsplash)

థైరాయిడ్‌తో జుట్టు రాలడం సమస్య

థైరాయిడ్ వచ్చినవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శరీరం ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. జుట్టు రాలడంతోపాటు ఇతర సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ ఎంత తీవ్రంగా ఉందో వ్యక్తులను బట్టి ఉంటుంది.

థైరాయిడ్ సమస్య ఉంటే, ప్రధాన ఆందోళన జుట్టు రాలడం. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారపు చిన్న గ్రంథి. ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ విడుదలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు దాని ప్రభావం శరీరంపై కనిపిస్తుంది.

హైపోథైరాయిడిజం : హైపోథైరాయిడిజం అనేది హార్మోన్లు తక్కువ పరిమాణంలో విడుదలయ్యే సమస్య. అప్పుడు బరువు చాలా పెరుగుతుంది. మలబద్ధకం, అలసట, ఇతర సమస్యలు కనిపిస్తాయి.

హైపర్ థైరాయిడిజం : శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరిగినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది. మీకు హైపర్ థైరాయిడిజం ఉంటే మీరు చాలా బరువు కోల్పోతారు.

ఇవి తీసుకోవాలి

థైరాయిడ్ హార్మోన్ల వ్యత్యాసాల వల్ల శరీరంలో ఐరన్ లెవెల్స్‌లో మార్పులు వస్తాయి. మీ ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు చేర్చుకోండి. ద్రాక్ష, ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. కొత్తిమీర, నిమ్మరసం, కరివేపాకు వంటి విటమిన్ సి ఆహారాలను మీ ఆహారంలో తీసుకోవాలి. ఇవి శరీరంలో ఐరన్ కంటెంట్ మెయింటెన్ చేయడంలో ఉపయోగపడతాయని గుర్తుంచుకోవాలి.

జుట్టు రాలకుండా జాగ్రత్తలు

థైరాయిడ్ వలన జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్ లోపం ఉన్న కారణంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి శ్రద్ధ వహించాలి. థైరాయిడ్ ఉంటే రోజూ ఉదయం క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. పోషకాహారం తీనాలి. మీ జుట్టుకు సరిపోయే జుట్టు సంరక్షణ దినచర్యను ఫాలో కావాలి.

థైరాయిడ్ ఉంటే.. చాలా మైకం ఉంటుంది. మతిమరుపు కూడా వస్తుంది. తరచుగా మలబద్ధకం, పొడి బారిన చర్మం, శరీరంలో ఉబ్బరం కనిపిస్తుంది. క్రమరహిత ఋతుస్రావం, డిప్రెషన్ ఎదుర్కొంటారు. అయితే థేరాయిడ్ ఉన్నవారు జుట్టు రాలకుండా ఉండేందుకు కింది ఆహారాలు తీసుకోవచ్చు.

ఈ ఆహారాలు తప్పకుండా తినండి

ఫిష్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. చేపలలో అయోడిన్ కంటెంట్ చాలా మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా రొయ్యలు అద్భుతమైన ఆహారం. ఇందులో సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ బి12 పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినండి. పచ్చసొనతో తినాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలేయాన్ని తీసుకోవడం మంచిది. మాంసం కంటే కాలేయంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాలేయంలో విటమిన్ బి, బి12, ఫోలేట్, మినరల్స్, ఐరన్, జింక్ పుష్కలంగా దొరుకుతాయి. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలు తింటే థైరాయిడ్ వలన జుట్టు రాలడం సమస్యను కొంత వరకు నివారించుకోవచ్చు.

ఈ ఆహారాలు తినకూడదు

ప్రాసెస్ చేసిన ఆహారాలు థైరాయిడ్ ఉన్నవారు తినకూడదు. సోయా, గోధుమ, చక్కెర కలిగిన ఆహారాలు, క్యాబేజీలాంటి రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.

తదుపరి వ్యాసం