Belly Fat: బొజ్జను వేగంగా ఎలా కరిగించాలి? ఐదు టిప్స్ చెప్పిన న్యూట్రిషనిస్ట్
03 December 2024, 16:30 IST
- Belly Fat: కడుపు చుట్టూ ఉండే కొవ్వును కరిగించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఓ న్యూట్రిషనిస్ట్.. డైట్‍లో ఏం తీసుకోవాలో చెప్పారు. 5 టిప్స్ పంచుకున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Belly Fat: బొజ్జను వేగంగా ఎలా కరిగించాలి? ఐదు టిప్స్ చెప్పిన న్యూట్రిషనిస్ట్
కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటే (బెల్లీ ఫ్యాట్) బొజ్జ సైజ్ పెరుగుతూ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అందుకే బొజ్జ తగ్గించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ఇందుకోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో డైటిషియన్ షితిజా వెల్లడించారు.
బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని షితిజా చెప్పారు. అలాగే, ఏవి ఎక్కువ తినాలో కూడా వెల్లడించారు. కొవ్వు కరిగేందుకు సహకరించే వారి గురించి వివరించారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ విషయంపై పోస్ట్ చేశారు.
బెల్లీ ఫ్యాట్.. చాలా రిస్క్
బెల్లీ ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని షితిజా అన్నారు. “బెల్లీ ఫ్యాట్ అనేది భారం మాత్రమే కాదు. మీ ఆరోగ్యానికి ఇది సైలెంట్ రిస్క్. ఎలా ఫైట్ చేయాలో నేను చెబుతా. మీ బెల్లీ ఫ్యాట్‍ను కరిగించుకునేందుకు రెడీగా ఉన్నారా? దీన్ని మీరు ఆరంభించేందుకు ఇవి నా టాప్ ట్రిక్స్, టిప్స్” అంటూ వీడియో మొదలుపెట్టారు షితిజా.
ఐదు టిప్స్ ఇవే
బెల్లీ ఫ్యాట్ కరిగించాలని అనుకుంటున్న వారి కోసం ఆహారం విషయంలో ఐదు టిప్స్ చెప్పారు షితిజా. అవేవంటే..
- ముందుగా.. ప్యాక్డ్ ఫుడ్స్ అసలు తినొద్దు. వాటికి నో చెప్పేయండి.
- రెండోది.. చాలా ఆకుకూరలు తినండి. బ్రోకలీ, ఉల్లిపాయ తీసుకోండి. అన్ని కూరగాయలు మంచివే. స్ట్రాచీవి మాత్రం వద్దు.
- మూడోది, మీ డైట్‍లో అవకాడో, వాల్‍నట్స్ తప్పనిసరిగా తీసుకోండి. అవి మంచి ఫ్యాట్ కలిగి ఉంటాయి.
- యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీలు తినండి. గ్రీన్ టీ కూడా తీసుకోండి. కంబూచా మీ పేగులకు ఎంతో మేలు చేస్తుంది.
- ఇక నా ఫేవరెట్ ప్రోటీన్. ఎలాంటి ఫ్యాట్ లాస్ ప్రయత్నానికైనా ఇది చాలా ముఖ్యం. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తినాలని షితిజా సూచించారు.
వర్కౌట్స్ కూడా ముఖ్యం
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే పోషకాలతో కూడిన డైట్‍తో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతీ రోజూ వర్కౌట్స్ చేయాలి. ఫిట్‍నెస్ గోల్‍కు తగ్గట్టుగా ఎక్సర్‌సైజ్‍లను చేయాలి. క్యాలరీలను బర్న్ చేయాలి. డైట్‍ను కూడా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్ సహా కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాలు తినాలి. ప్యాక్డ్, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్ తినకూడదు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయితే, డైట్, వర్కౌట్స్ విషయాలను క్రమశిక్షణతో చేసుకుంటూ పోతే ఫలితాలు ఉంటాయి.
టాపిక్