Weight Loss: బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్స్ తింటున్నారా? రోజులో ఎంత అవసరమో తెలుసుకోండి.. అతిగా తీసుకుంటే ఈ రిస్క్-how much protein need to take everyday for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్స్ తింటున్నారా? రోజులో ఎంత అవసరమో తెలుసుకోండి.. అతిగా తీసుకుంటే ఈ రిస్క్

Weight Loss: బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్స్ తింటున్నారా? రోజులో ఎంత అవసరమో తెలుసుకోండి.. అతిగా తీసుకుంటే ఈ రిస్క్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2024 08:30 AM IST

Weight Loss - Protein Intake: బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తినడం ముఖ్యం. అయితే, రోజులో ఎంత ప్రోటీన్‍ను శరీరానికి అందించాలో తెలుసుకోడం ముఖ్యం. మంచిది కదా అని ప్రోటీన్‍ను మరీ అతిగా తీసుకోకూడదు. రోజులో ఎంత ప్రోటీన్ ఇన్‍టేక్ ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

Weight Loss: బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్స్ తింటున్నారా? రోజులో ఎంత అవసరమో తెలుసుకోండి.. అతిగా తీసుకుంటే ఈ రిస్క్
Weight Loss: బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్స్ తింటున్నారా? రోజులో ఎంత అవసరమో తెలుసుకోండి.. అతిగా తీసుకుంటే ఈ రిస్క్ (Freepik)

బరువు తగ్గేందుకు తీసుకునే ఆహారమే కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వెయిట్ లాస్ కావాలంటే డైట్ ప్లాన్ పాటించాలి. అయితే, ఇది అప్పడప్పుడు కన్‍ఫ్యూజింగ్‍గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్‍లో తీసుకోవాలి. వెయిట్ లాస్‍కు ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, రోజులో ఎంత ప్రోటీన్‍ను శరీరానికి అందించాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సరైన క్లారిటీ లేక ప్రోటీన్ అతిగా తీసుకుంటే బరువు పెరిగే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే బరువు తగ్గేందుకు రోజులో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి.. దీని బెనెఫిట్స్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఎంత ప్రోటీన్ తీసుకోవాలి?

బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే.. మీ శరీర బరువులో ఒక్కో కేజీకి ప్రతీ రోజు 0.8 నుంచి 1.6 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు మీ శరీర బరువు 80 కేజీలుగా ఉంటే ప్రతీ రోజు సుమారు 64 నుంచి 128 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు రోజులో 128 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు. కాస్త నిశ్చలమైన జీవనశైలి ఉండేవారు 64 నుంచి 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకునే వారు వారానికి కేజీ వరకు బరువు తగ్గొచ్చు. అయితే, వర్కౌట్లు, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలు కూడా వీటితో పాటు ఉండాలి.

బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఎలా ఉపయోగపడుతుంది?

తృప్తి పెంచుతుంది: ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండిన తృప్తిని కలిగిస్తుంది. ఆహారం ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది. దీంతో క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే త్వరగా ఆకలి కాదు.

కండరాలకు మేలు: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే మజిల్ (కంజరాలు) లాస్ కాకుండా ప్రోటీన్ కాపాడుతుంది. ప్రోటీన్ తగినంత తీసుకుంటే మజిల్ మాస్‍ను కాపాడి.. దానిబదులు ఫ్యాట్ తగ్గేలా చేస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు కూడా మజిల్ లాస్ లేకుండా ప్రోటీన్ తోడ్పడుతుంది.

జీవక్రియ మెరుగుదల: కార్బోహైట్రేడ్లు, ఫ్యాట్స్ కన్నా ప్రోటీన్ జీర్ణం కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. దీనివల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.

ఫ్యాట్ కరిగేందుకు: శరీరంలో గ్లూకగాన్ లాంటి హర్మోన్ల ఉత్పత్తిని ప్రోటీన్ పెంచదలదు. ఈ హార్మోన్లు కొవ్వు కరిగేందుకు సహకరించి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. ఇది కొన్ని అధ్యయాల్లో తేలింది. అలాగే, ఆకలిని పెంచే ఘెరెలిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రోటీన్ తగ్గించగలదు. తరచూ తినేలా ఆశను తగ్గించి వెయిట్ లాస్‍కు ప్రోటీన్ ఉపకరిస్తుంది.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే పుడ్స్

గుడ్లు, పన్నీర్, పప్పు దాన్యాలు, లీన్ మీట్, కాయధాన్యాలు, నట్స్, క్వినోవా, పెరుగు, టోఫు, పన్నీర్, చేపలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వేటిలో ఎంత ప్రోటీన్ మోతాదు ఉంటుందో తెలుసుకొని మీ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఆధారంగా వీటిని తినాలి.

ఎక్కువైతే ఈ రిస్క్

ప్రతీ రోజు ప్రోటీన్‍ను మోతాదు మేర తీసుకుంటే బరువు తగ్గేందుకు చాలా సహకరిస్తుంది. వేగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడుతుంది. అయితే, ప్రోటీన్‍ను అతిగా శరీరానికి అందిస్తే బరువు పెరిగే రిస్క్ కూడా ఉంటుంది. ఇతర సమస్యలు కూడా ఎదురుకావొచ్చు. అందుకే ప్రోటీన్‍ను సరిపడానే తీసుకుంటే మంచిది.

Whats_app_banner