తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినడం సేఫేనా?

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినడం సేఫేనా?

06 December 2024, 16:30 IST

google News
    • Diabetes - Dark Chocolate: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినొచ్చా అనే సందేహం ఉంటుంది. ఇది తీపిగా ఉండటంతో ఇది తీసుకోవచ్చా అనే డౌట్ తలెత్తుతుంటుంది. ఒకవేళ తింటే ఎంత తినొచ్చనే ప్రశ్న కూడా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినడం సేఫేనా? (Photo: Pexels)
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినడం సేఫేనా? (Photo: Pexels)

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినడం సేఫేనా? (Photo: Pexels)

మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేలా డైట్ పాటించాలి. ఆహారం విషయంలో పొరపాట్లు జరిగితే షుగర్ పెరిగి మరిన్ని ఇబ్బందుల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే, డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినొచ్చా.. మంచిదేనా అనే డౌట్ ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ తీపిగా ఉండటంతో ఈ సందేహం వినిపిస్తూ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తినొచ్చు.. కానీ ఇవి గమనించాలి

డయాబెటిస్ ఉన్న వారు మోతాదు మేరకు డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. పరిమిత మేర ఇవి తినడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. అయితే, కనీసం 70 శాతం అంతకంటే ఎక్కువ కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్ మాత్రమే తినాలి. షుగర్ లెస్ లేకపోతే షుగర్ శాతం చాలా తక్కువగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినాలంటే ఈ రెండు విషయాలను తప్పక గమనించాలి. ఆ రెండు పాటించేలా ఉంటేనే అలాంటి డార్క్ చాక్లెట్లను మోతాదు మేరకు తినొచ్చు.

రోజులో ఎంత?

డయాబెటిస్ ఉన్న వారు రోజులో 25 గ్రాముల డార్క్ చాక్లెట్ మాత్రమే తినొచ్చు. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా 70 శాతానికి పైగా కొకోవా, తక్కువ షుగర్ ఉన్నవే తీసుకోవాలి. ఈ మోతాదులో మధుమేహం ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినొచ్చు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి.

షుగర్ కంట్రోల్ అయ్యేలా..

డార్క్ చాక్లెట్‍లో పోలిఫెనోల్స్ అనే యాంటీఆక్సెడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో ఇవి మోతాదు మేరకు తింటే శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్‍లో ఉండేందుకు డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుంది.

డార్క్ చాక్లెట్‍లో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. దీంతో ఇది తిన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. కంట్రోల్‍లో ఉంటాయి. అయితే, పరిమితి మేర తినడం చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.

టైప్ 2 రిస్క్ తగ్గిస్తుంది

డయాబెటిస్ టైప్ 2 రిస్క్‌ను డార్క్ చాక్లెట్ తగ్గిస్తుందని కొన్ని అధ్యయానాలు తేల్చాయి. కొకొవాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీడోట్‍గా పని చేస్తుంది. సాచురేడెట్ ఫ్యాట్, షుగర్ తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందుకే రోజులో 25 గ్రాములలోపు డార్క్ చాక్లెట్ తినడం ద్వారా టైప్ 2 డయాబెయాబెటిస్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. డార్క్ చాక్లెట్ వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది.

తీపి పదార్థాలు తినాలనే కోరికను కూడా డార్క్ చాక్లెట్ తగ్గించలదు. దీనివల్ల కూడా డయాబెటిస్ ఉన్న వారికి ఇది సహకరిస్తుంది. స్వీట్ తిన్న సంతృప్తినా డార్క్ చాక్లెట్ ఇవ్వగలదు. 

గమనిక: సమాచారం అందించేందుకే ఈ కథనం రూపొందించాం. ఇది వైద్య సలహా కాదు. మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఏవైనా సందేహాలు ఉండే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు ఏవైనా ఇబ్బందిగా అనిపించినా.. సందేహాలు ఉన్నా నిపుణులను కలిసి సలహాలు తీసుకోవాలి.

తదుపరి వ్యాసం