Home Remedies for Itchy Skin : చర్మ సమస్యలను సహజంగా ఇలా దూరం చేసుకోండి..
24 December 2022, 9:00 IST
- Home Remedies for Itchy Skin : చలికాలంలో చర్మం పొడిబారడం చాలా సహజం. అంతేకాకుండా కొన్నిసార్లు అలెర్జీవల్ల చర్మం దురద పెడుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మీ చర్మంపై దద్దర్లు, పొక్కులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
చలికాలంలో దురద సమస్యలను ఇలా తగ్గించుకోండి..
Home Remedies for Itchy Skin : చలికాలంలో మీరు దురద, చికాకును కలిగించే పొడి చర్మాన్ని కలిగి ఉండొచ్చు. ఇది మీ చర్మంపై తెల్లని గీతలు పడేలా చేస్తుంది. అంతేకాకుండా దురదను కలిగిస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. అధిక గోకడం వలన మీ చర్మంపై ఉన్న రక్షిత అవరోధం దెబ్బతింటుంది. ఇది మీ శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది.
అలెర్జీ ప్రతిచర్యలు, రసాయనాలతో, వాతావరణంలో మార్పుల వల్ల కూడా దురద వస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి, లేదా రాకుండా నివారించడానికి కొంటి ఇంటి నివారణ చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇంటి చిట్కాలు ఏమిటో.. చలికాలంలో మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంథాల్ ఆయిల్..
పుదీనా ఆకులతో తయారు చేసే నూనెలో ఉండే మెంథాల్ మీ చర్మానికి ప్రతిరోధకంగా పనిచేస్తుంది. చిన్న కాలిన గాయాలు, కోతలు, స్క్రాప్‌లు, దద్దుర్లు, పొడి చర్మం, క్రిమి కాటు వంటి మొదలైన వాటి వల్ల కలిగే దురద, ఎరుపు నుంచి ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మీకు వేడి, మంట నుంచి రిలీఫ్ ఇస్తూ.. శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది.
2012 అధ్యయనం ప్రకారం.. గర్భిణీ స్త్రీలలో చర్మం దురదను తగ్గించడంలో మెంథాల్‌తో కూడిన పిప్పరమెంటు నూనెను ఉపయోగించారని.. దీనివల్ల చర్మపు చికాకులు తగ్గాయని.. దానివల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి ఇది సహాయపడినట్లు తేలింది.
వోట్మీల్ స్నానం
శతాబ్దాలుగా వోట్స్ వివిధ చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి వోట్మిల్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. పొడి చర్మం, దురద, కరుకుదనాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
కొల్లాయిడ్ వోట్మీల్ బాత్ (సన్నగా గ్రౌండ్ చేసిన ఓట్స్) మీ చర్మంపైనున్న అవరోధాన్ని బలపరచడమే కాకుండా.. దురద కలిగించే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఇది మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దురద తీవ్రతను తగ్గిస్తుంది.
కలబందతో..
యాంటీ ఫంగల్ లక్షణాలతో నిండిన కలబంద గుజ్జు మీకు పొడి చర్మం నుంచి ఉపశమనం ఇస్తుంది. దురద, మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది మీ చర్మాన్ని క్లియర్‌గా, ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తుంది.
చర్మం దురదను తగ్గించడానికి మీరు దీనిని రోజుకు రెండుసార్లు ప్రభావిత ప్రదేశంలో నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
వేప
భారతీయ గృహాలలో ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన మూలికలలో వేప ఒకటి. ఇది మీకు దురతో పాటు.. హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. దీనిలోని యాంటీ మైక్రోబియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన వేప శరీరంపై దద్దుర్లను కూడా నయం చేస్తుంది.
మీరు వేప ఆకులను గోరువెచ్చని నీటిలో 30 నిమిషాలు నానబెట్టి.. దురద, పొడి, చికాకు కలిగించే చర్మానికి చికిత్స చేయవచ్చు. లేదా ఆ నీటితో స్నానం కూడా చేయవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్
యాంటిసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన ఆపిల్ సైడర్ వెనిగర్.. మీ పొడి, దురద, చికాకు కలిగించే చర్మం నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది చర్మంలోని అసిడిటీ స్థాయిలను పునరుద్ధరించి.. దురద, తామర నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. బగ్ కాటుపై స్పాట్ ట్రీట్మెంట్‌గా అద్భుతంగా పనిచేస్తుంది.
దీనికోసం మీరు డైల్యూట్ చేసిన యాపిల్ సైడర్ వెనిగర్ మాత్రమే ఉపయోగించాలి. ఇది మీ చర్మం pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దురదను తగ్గిస్తుంది.