తెలుగు న్యూస్ / ఫోటో /
Skin Care : వేసవిలో దురద ఇబ్బంది పెడుతుందా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి..
- వేసవిలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా చెమట పట్టడం లేదా ఇతర కారణాల వల్ల దురద వస్తుంది. మీరు కొన్ని ఇంటి నివారణలతో ఈ వేసవి ఎచింగ్ నుండి బయటపడవచ్చు. ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి.
- వేసవిలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా చెమట పట్టడం లేదా ఇతర కారణాల వల్ల దురద వస్తుంది. మీరు కొన్ని ఇంటి నివారణలతో ఈ వేసవి ఎచింగ్ నుండి బయటపడవచ్చు. ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి.
(1 / 6)
వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చెమట వల్ల చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తాయి. ఈ దురదను మనం కేవలం లేపనం లేదా డాక్టర్ సూచించిన ఔషధం తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అలాగే కొన్ని నేచురల్, హోం రెమెడీస్ కూడా ఈ దురద నుంచి మీకు విముక్తిని ఇస్తాయి. మీ ఇంట్లో ఉండే చాలా వస్తువులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దురదను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు చర్మ వ్యాధి నిపుణులు. (Freepik)
(2 / 6)
కోల్డ్ కంప్రెస్ దురదకు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. 5 నుంచి 10 నిమిషాల పాటు దురద ఉన్న ప్రదేశంలో చల్లని, తడి గుడ్డ, ఐస్ ప్యాక్ వీటిలో దేనినైనా ఉపయోగించండి. దురద ఉన్న చర్మపు చికాకును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా లోషన్ రాసుకోవాలి.(Freepik)
(3 / 6)
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఓట్స్‌ను ఎఫెక్టివ్ రెమెడీగా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మం పొడి, దురదను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురద వల్ల వచ్చే చర్మపు చికాకును తగ్గిస్తాయి.(Freepik)
(4 / 6)
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చాలా సంవత్సరాలుగా సహజ క్రిమిసంహారక, క్రిమినాశక మందుగా ఉపయోగిస్తున్నాము. నేషనల్ సోరియాసిస్ ఫౌండేషన్ ప్రకారం.. యాపిల్ సైడర్ వెనిగర్ దురద నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరకప్పు దీనిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
(5 / 6)
చర్మం దురద నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు వేప అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా పరిగణిస్తారు. అందుకే వేప ఆకులను చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది మొటిమలు, దురద లేదా చర్మసమస్యలకు పేస్ట్ రూపంలో ఉపయోగించవచ్చు. చర్మం దురద, మొటిమలు, ఎరుపును తగ్గించడంలో కూడా వేప ఉపయోగపడుతుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు