తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day Singles Plans : హలో సింగిల్స్.. వాలెంటైన్స్ డేకు ఈ ఫన్నీ పనులు చేసేస్తే పోలా

Valentines Day Singles Plans : హలో సింగిల్స్.. వాలెంటైన్స్ డేకు ఈ ఫన్నీ పనులు చేసేస్తే పోలా

Anand Sai HT Telugu

06 February 2023, 11:01 IST

google News
    • Singles Plans For Valentines Day : అయ్యో.. నాకు లవర్ లేదాయే.. ఫిబ్రవరి 14న ఎలా మరి. తెలిసినవాళ్లేమో.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. కదా. ఇలా ఆలోచించకండి. చేయాలనుకుంటే.. చాలా పనులు ఉన్నాయి. ఎవరితో మింగిల్ కాకపోయినా.. సింగిల్ ఉన్నా.. ఎంజాయ్ చేయోచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Valentines Day 2023 : వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. సింగిల్స్.. జంటల వైపు కోపంగా చూస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు. మరికొంతమందేమో.. వీళ్ల లవ్ ఏంటో.. వీళ్ల కథేంటో అంటూ కామెంట్లు చేస్తారు. ఎవరేం అనుకున్నా.. మీకు లవర్ లేదని.. అస్సలు బాధపడకండి.. కొన్ని ప్లాన్స్ చేసుకుని.. ఆరోజున ఎంజాయ్ చేయండి. లవర్స్ కంటే.. సింగిల్సే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనుకునేలా చేయాలి. అంతేగానీ.. జంట లేదని హర్ట్ అవ్వకండి.

వాలెంటైన్స్ డే(Valentines Day) జంటల కోసం మాత్రమే కాదు.. ఇది సింగిల్స్‌కు అద్భుతమైన రోజు కూడా. మీపై మీరు, మీ స్నేహితుల పట్ల, మీ కుటుంబం పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో టన్నుల కొద్దీ సరదాగా చూపించొచ్చు. మీ సింగిల్ ఫ్రెండ్స్(Single Friends) అందరినీ పిలిచి ఓ ఫొటో షూట్ పెట్టుకోండి.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను పోగేసుకోవచ్చు. అలా మీకోసం కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.

మీ స్నేహితులకు ఎలాగూ ఓ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఫిబ్రవరి 14న ఎక్కడికి వెళ్లాలో ముందుగా అందులో డిస్కషన్ చేయండి. ఆరోజున సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్లండి. సింగిల్ ఫ్రెండ్స్ అంతా.. కలిసి ఎంజాయ్ చేయోచ్చు.

మీకు ఇష్టమైన కొన్ని సినిమా(Cinema)లను ఎంచుకొని, వాటిని మీ సోఫాలోనే కూర్చొని చూడండి. ఇంట్లో వాళ్లు, లేదా స్నేహితులతో కలిసి కామెడీ సినిమా(Comedy Cinema) చూడండి. అలా వద్దు అనుకుంటే.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడవచ్చు.

మీ ఫ్రెండ్స్ లో కొంతమంది.. సింగిల్స్ ఉంటారు కదా. వాళ్లను తీసుకుని.. స్థానికంగా ఉండే జంతువులకు ఫుడ్ ఇవ్వడం, వాటి ఆశ్రయం గురించి మాట్లాడటం, ఏదైనా ఆసుపత్రికి వాలంటీర్ గా వెళ్లి పని చేయండి. ఓ కొత్త రకమైన ప్రపంచాన్ని చూసి రావొచ్చు.

దగ్గరలో ఏదైనా కచేరీలు ఉంటే వెళ్లండి. ఫ్రెండ్స్ తో వెళితే ఇది సరదాగా ఉంటుంది. ఆనందించండి.. మీకు ఇష్టమైన కొన్ని పాటలను ఆస్వాదిస్తూ డ్యాన్స్ ఫ్లోర్‌లో విశ్రాంతి తీసుకోండి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొత్త రెస్టారెంట్‌కు వెళ్లండి. మీరు ఇంకా చూడని రెస్టారెంట్‌లు మీ చుట్టూ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. వాటికి వెళ్లే ప్రయత్నం చేయండి.

లేదంటే ఆరోజున కొత్త పుస్తకాన్ని తీసుకొని చదవడం మెుదలుపెట్టండి. ఏమో.. ఆ పుస్తకంతో సరికొత్త ప్రపంచానికి ప్రయాణం చేస్తారేమో. మీరు ఎప్పటినుంచో రాయాలనుకున్న పుస్తకమైనా లేదా మరేపనైనా.. పూర్తి చేయండి.

సరదాగా డ్యాన్స్ క్లాస్‌(Dance Class)కు వెళ్లండి. మీకు డ్యాన్స్ రాకపోయినా పర్లేదు.. ఫన్నీగా ఆరోజు సాగిపోతుంది. మీకు మరింత ఉత్సాహాన్ని కలిగించవచ్చు.

కొత్త ప్రదేశాలకు వెళితే వచ్చే ఉత్సహామే వేరు.. ఫ్రెండ్స్ తో కలిసి ఆరోజున కొత్త ప్రదేశాలకు వెళ్లండి. మీరు చాలా దూరం వెళ్లవలసిన అవసరం లేదు. మీ చట్టూ మీరు చూడని ప్రదేశాలు చాలానే ఉంటాయి. సైకిల్ తీసుకని అలా సరదాగా వెళ్లిరండి.

ఇలా ఆలోచిస్తూ.. పోతే.. చాలానే పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న లవర్ లేదని బాధపడటం కంటే.. ఏదైనా సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న బాగానే ఉంటుంది. దగ్గరలోని అనాథ ఆశ్రమాల్లోనూ.. ఆ రోజున వెళ్లి వాలంటీర్ గా సర్వీస్ చేసే ప్లాన్ చేసుకోండి.

తదుపరి వ్యాసం