తెలుగు న్యూస్ / ఫోటో /
Thanks Giving 2022 : థాంక్స్ గివింగ్కి ఇవి చేసేయండి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేయండి..
- థాంక్స్ గివింగ్ అనేది పాశ్చాత్య దేశాల పండుగ అయినా.. ఆ సమయంలో చేసే డిష్‌లు లిప్-స్మాకింగ్ ఉంటాయి. అయితే మీరు మీ డిన్నర్‌ను టేస్టీగా చేయాలి అనుకుంటే.. ఈ రెసిపీలు ట్రై చేయండి.
- థాంక్స్ గివింగ్ అనేది పాశ్చాత్య దేశాల పండుగ అయినా.. ఆ సమయంలో చేసే డిష్‌లు లిప్-స్మాకింగ్ ఉంటాయి. అయితే మీరు మీ డిన్నర్‌ను టేస్టీగా చేయాలి అనుకుంటే.. ఈ రెసిపీలు ట్రై చేయండి.
(1 / 5)
కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగవ గురువారం చేసుకుంటారు. థాంక్స్ గివింగ్ పండుగ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని పంటల పండుగ అని కూడా అంటారు. గత సంవత్సరం చేసిన త్యాగాలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు చెప్తూ.. కృతజ్ఞతతో దీనిని జరుపుకుంటారు. థాంక్స్ గివింగ్ అనేది ఆహారానికి సంబంధించినది. కాబట్టి ఈ సీజన్‌లో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తారు.(Unsplash)
(2 / 5)
వెజిటేరియన్ రోస్టెడ్ కాలీఫ్లవర్ సూప్. చలిని తట్టుకోవడానికి ఈ సూప్ చక్కగా పనిచేస్తుంది. శాకాహారులు, మాంసాహారులు సైతం దీనిని వెచ్చదనం కోసం తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌ను, ఉల్లిపాయలు, వెల్లుల్లితో వేయించి.. ఉప్పు, మిరియాలతో ఈ సూప్ చేస్తారు.(Unsplash)
(3 / 5)
డిన్నర్ టేబుల్‌పై టర్కీ డిష్ లేకుండా థాంక్స్ గివింగ్ పూర్తి కాదు. ఈ సంవత్సరం మీరు ఓల్డ్-స్కూల్ ఓవెన్-బేక్డ్ టర్కీకి బదులుగా గాలిలో వేయించిన రోజ్మేరీ టర్కీ బ్రెస్ట్‌ను ట్రై చేయవచ్చు. దీనిని సాధారణ పద్ధతిలో సీజన్ చేయండి. మరింత రోజ్మేరీని జోడించి 350ºF వద్ద 25 నిమిషాలు లేదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎయిర్ ఫ్రై చేయండి.(Unsplash)
(4 / 5)
మీ సాధారణ మెత్తని బంగాళాదుంపలకు మరింత గొప్పతనాన్ని కలిపి.. మరో డిష్ తయారు చేయవచ్చు. డిష్ రుచిని పెంచడానికి..ఆలును వెన్నతో ఫ్రై చేయండి. చిలగడదుంపలను కూడా ఇలా ట్రై చేయవచ్చు.(Unsplash)
ఇతర గ్యాలరీలు