తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilli Egg Roast Recipe । నాలుకకు కారం తగిలేలా.. చిల్లీ ఎగ్ రోస్ట్ చేసేయండిలా!

Chilli Egg Roast Recipe । నాలుకకు కారం తగిలేలా.. చిల్లీ ఎగ్ రోస్ట్ చేసేయండిలా!

HT Telugu Desk HT Telugu

06 December 2022, 23:37 IST

google News
    • నాలుకకు రుచి తగిలేలా ఏదైనా తినాలనుకుంటున్నారా? Chilli Egg Roast Recipe ని ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది.
Chilli Egg Roast Recipe
Chilli Egg Roast Recipe (slurrp)

Chilli Egg Roast Recipe

తినడానికి త్వరగా ఏదైనా సిద్ధం చేసుకోవాలనుకుంటే కోడిగుడ్లు బెస్ట్ ఆప్షన్. గుడ్డుతో ఎలాంటి వంటకాన్నైనా క్షణాల్లో చేసుకోవచ్చు, పైగా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. కోడి గుడ్డును ఆమ్లెట్ చేసుకోవడం కంటే ఉడకబెట్టుకొని తింటేనే మంచిదని అంటారు. అయితే మీకు ఉడకబెట్టిన గుడ్డు తినడం నచ్చకపోతే మీకు నచ్చేలా, నాలుకకు కొంచెం కారం రుచి తగిలేలా చిల్లీ ఎగ్ రోస్ట్ చేసుకోవచ్చు.

ఈ వంటకం ఎంతో రుచికరంగా ఉంటుంది, అంతేకాదు దీనిని చాలా సులభంగా, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. మరి ఫటాఫట్‌గా చిల్లీ ఎగ్ రోస్ట్ చేసేద్దామా? ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఉంది చూసేయండి.

Chilli Egg Roast Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 6 ఉడికించిన గుడ్లు
  • 6 టీస్పూన్లు ఎర్రటి కారం పొడి
  • ఉప్పు 2 టీస్పూన్లు
  • నూనె 3 టీస్పూన్లు
  • కొన్ని కరివేపాకు
  • 4-5 వెల్లుల్లి రెబ్బలు

చిల్లీ ఎగ్ రోస్ట్ రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో కారపు పొడి, ఉప్పు కలపాలి, మరోవైపు ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కారం- ఉప్పు కలిపిన గిన్నెలో గుడ్డుముక్కలను ముంచి బయటకు తీయాలి.
  3. ఒక కడాయిలో నూనె వేడి చేసి, నూనె వేడయ్యాక కరివేపాకు ఆకులు, చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి.
  4. ఆదే నూనెలో ఉప్పు-కారం పట్టించిన గుడ్లను వేయించాలి.
  5. గుడ్లు వేగిన తర్వాత, దానిని ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అంతే చిల్లీ ఎగ్ రోస్ట్ రెడీ, పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని, ఉల్లిపాయ నంజుకుంటూ చిల్లీ ఎగ్ రోస్ట్ తింటే ఆ రుచి వేరెలెవెల్.

టాపిక్

తదుపరి వ్యాసం