Green Chilli Benefits | వంటల్లో కారం పొడికి బదులు పచ్చి మిరపకాయలు వాడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Green Chilli Benefits: సాధారణంగా మనం పప్పులు, కూరల్లో ఎర్రటి పొడికారం లేదా పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తాం. మరి ఈ రెండిటిలో ఏది ఉత్తమం అంటే పచ్చిమిర్చే అని అంటున్నారు. పచ్చిమిర్చితో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట, అవేంటో చూడండి.
- Green Chilli Benefits: సాధారణంగా మనం పప్పులు, కూరల్లో ఎర్రటి పొడికారం లేదా పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తాం. మరి ఈ రెండిటిలో ఏది ఉత్తమం అంటే పచ్చిమిర్చే అని అంటున్నారు. పచ్చిమిర్చితో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట, అవేంటో చూడండి.
(1 / 8)
భారతీయులు కొద్దిగా కారం ఎక్కువగానే తింటారు. ఇందుకోసం వంటకాల్లో కారంపొడి , పచ్చిమిర్చ్చి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిర్చితో వండుకొని తింటే బరువు తగ్గటం నుంచి జలుబుకు ఉపశమనం వరకు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
(2 / 8)
పచ్చిమిర్చిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రేగు కదలికలను సాఫీగా చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి అజీర్ణం అనేది ఉండదు. వంటల్లో పచ్చి మిరపకాయలను ఉపయోగించటం వల్ల కడుపు అల్సర్లను కూడా దూరం చేసుకోవచ్చు.
(3 / 8)
పచ్చి మిరపకాయలతో వండిన ఆహారం తినడం వలన జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఇది దాని థర్మోజెనిక్ గుణాలతో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గవచ్చు.
(4 / 8)
పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ముక్కు శ్లేష్మ పొరపై ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణ ఫ్లూని నయం చేయడంలో తోడ్పడుతుంది.
(5 / 8)
పచ్చి మిర్చిలో విటమిన్ సి , బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి.
(6 / 8)
రోజూ పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు.
(7 / 8)
పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ కణాలను పెంచే ఫ్రీ రాడికల్స్ నుండి మీ శరీరాన్ని రక్షిస్తాయి. చివరగా.. పచ్చిమిర్చి తినాలి, అయితే అది మోతాదుకు మించకూడదు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు