Heenakhan: క్యాన్సర్‌తో పోరాడుతూ హీనాఖాన్ ర్యాంప్ వాక్.. అందం, ఆత్మవిశ్వాసం ఉన్న వధువుగా
16 September 2024, 19:00 IST
Heenakhan rampwalk: హీనా ఖాన్ క్యాన్సర్ చికిత్స పొందుతూ కూడా తన తిరుగులేని పట్టుదల, ధైర్యాన్ని నిరూపించుకుంటూ అందమైన బ్రైడల్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసి ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు వీడియోలు చూడండి.
ర్యాప్ వాక్ చేసిన హీనాఖాన్
హీనా ఖాన్ అనగానే రొమ్ము క్యాన్సర్‌తో తను చేస్తున్న పోరాటం గుర్తొస్తోంది. సోషల్ మీడియాలో ఈ చికిత్సకు సంబంధించిన ఫొటోలు, ఆరోగ్య వివరాలనే పంచుకుంటున్నారామె. కానీ ఒక్కసారిగా అందమైన దుస్తుల్లో ముస్తాబయ్యి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది హీనాఖాన్. స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ, కీమోథెరపీ చేయించుకుంటూ ఆ బాధని ఎక్కడా కనిపించకుండా తన ర్యాంప్ వాక్‌తో అందర్నీ ఆకట్టుకున్నారామె. ఆమెలో ఉన్న ధైర్యం ఎంతో మంది క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు స్ఫూర్తిదాయకమే. ఈసారి హీనాఖాన్ అందంతోనే కాక, ఆత్మ విశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంది.
హీనా ఖాన్ ర్యాంప్ వాక్
హీనా తన అద్భుతమైన బ్రైడల్ లుక్‌కు సంబంధించిన రీల్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి ఒక గుండెను కదిలించే క్యాప్షన్ కూడా పెట్టింది. నేను ఫలితం గురించి ఆందోళన చెందడం మానేసి, నా చేతుల్లో ఉన్న విషయాల మీద దృష్టి పెట్టానంటూ హీనా రాసుకొచ్చింది. ఆ అల్లా నా ప్రయత్నాలను చూస్తాడు, నా ప్రార్థనలు వింటాడు, నా మనసు తెల్సుకుంటాడని రాసింది. ఇది అంత సులభమైన ప్రయాణం కాదు.. కానీ నాకు నేను “ముందుకు సాగిపో.. ఆగిపోకు” అని చెప్పుకుంటున్నాను అని తన క్యాప్షన్‌లో రాసింది హీనాఖాన్.
హీనా ఖాన్ బ్రైడల్ లుక్:
హీనా ఖాన్ వినాల్ పటేల్ 'సజానీ' బ్రైడల్ కలెక్షన్ కు షోస్టాపర్ గా వ్యవహరించింది . సిల్వర్ చేతి ఎంబ్రాయిడరీతో చేసిన స్కూప్-నెక్ బ్లౌజ్, ఫ్లేర్డ్ లెహంగా స్కర్ట్ తో, హెవీ సీక్విన్లు చేతి పనితనంతో హ్యాండ్ వర్క్ తో అందంగా అలంకరించి ఉంది లెహెంగా. అద్భుతంగా ఉన్న ఈ ఎరుపు రంగు దుస్తుల్లో ఆమె పెళ్లి కూతురు లాగా కనిపించింది. ఈ లుక్‌కు జతగా దుపట్టాను తలపై ముసుగులాగా వేసుకుంది హీనాఖాన్.
చోకర్ నెక్లెస్, స్టేట్మెంట్ చెవిపోగులు, ముక్కు పుడక, ఉంగరం, మాతా పట్టి, మణికట్టుమీద గాజులతో సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో ఆమె తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. స్మోకీ ఐ మేకప్, రెడ్ బ్లష్ అద్దిన బుగ్గలు, హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ తో ఆమె మేకప్ అదిరిపోయింది. చిక్ బన్ లో ఉన్న తన అందచందాలతో ఆమె లుక్ పూర్తి చేసింది.